Sai Dharam Tej: విరూపాక్ష బ్లాక్ బస్టర్ అవుతుంది!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదం తర్వాత నటించినటువంటి మొదటి చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా 21వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాదులో చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ అభిమానులు ప్రేమ ఆశీర్వాదం, వారి ప్రార్థన వల్లే నేను తిరిగి ఈ వేదికపై నిలబడ్డాను అంటూ తెలియజేశారు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో సుకుమార్ గారు తనకు ఫోన్ చేసి విరూపాక్ష కథ వినమని చెప్పారు. అయితే ఇది ప్రేమ కథ అయ్యుంటుందని భావించాను. కార్తీక్ వచ్చి ఇది థ్రిల్లర్ కథ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.ఈ సినిమా కథ విన్న తర్వాత ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుందని ఫిక్స్ అయ్యి ఈ సినిమా చేశానని సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా విషయంలో ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) వెల్లడించారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ, కార్తీక్ అమ్మ నా కొడుకులు అద్భుతమైన సినిమా చేశారనీ గర్వంగా చెప్పుకుంటారని తేజ్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయిందని అందుకు ఎన్టీఆర్ కి సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus