రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాస్త దూరం పెట్టిన సాయి ధరమ్ తేజ ఈసారి రిపబ్లిక్ తో ఈసారి సరికొత్త ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ లో సాయి ధరంతేజ్ ఒక ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నాడు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో నటించారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.
ట్రైలర్ లోకో వెళితే.. అధికార రాజకీయ న్యాయ వ్యవస్థలపై గట్టిగానే ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవస్థలో ప్రధానంగా ప్రజాస్వామ్యం సారైనా దారిలో వెళ్లాలని లెజిల్లేచర్, జ్యుడిషియరీ, లాంటి అంశాలను హైలెట్ చేసినట్లు అర్థమవుతోంది. అధికారిక వ్యవస్థకు ప్రతినిధిగా కలెక్టర్ సాయిధరమ్, రాజకీయ వ్యవస్థను నడిపే రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమా అసలు పాయింట్ అని తెలుస్తోంది. సినిమాలో డైలాగ్స్ కూడా ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
అదుపుతప్పిన రాజకీయ వ్యవస్థను జ్యూడిషియరీ నియంత్రించకపోతే, హిట్లర్ పుడతాడు.. అంటూ ఇంటలెక్చ్యువల్ గా వివరణ ఇచ్చారు. సినిమాకు సమణిశర్మ సంగీతం అంధించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇక సినిమాలో జగపతిబాబు మరొక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి ధరమ్ తేజ, రమ్యకృష్ణ పాత్రల మధ్య కొనసాగే రిపబ్లిక్ సీరియస్ కథనాన్ని ట్రైలర్ లోనే జస్ట్ శాంపిల్ గా చూపించారు. ఇక సినిమాలో ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్లలోకి రానుంది.