ఇండస్ట్రీలో సినిమా గురించి ఓ కామెంట్ ఉంటుంది. దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా.. ఎలా చెప్పినా ఆసక్తికరంగానే ఉంటుంది. ‘ఎవరికి రావాల్సిన సినిమా వాళ్ల దగ్గరకు ఎలా అయినా వస్తుంది.. అలాగే దగ్గరకు వచ్చిన ప్రతి కథ నీది కాదు’. ఈ మాటకు రెండు ఉదాహరణలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ ఇద్దరూ దురదృష్టవంతులే, అలాగే అదృష్టవంతులు కూడా. ఎందుకంటే ఆ సినిమా ఫలితాలు అలా ఉన్నాయిమరి.
‘ప్రేమ కావాలి’ (Prema Kavali) , ‘రేయ్’ (Rey) సినిమాలు గుర్తున్నాయా? అని అడిగితే ఎందుకు లేవు.. ఆది సాయి కుమార్ (Aadi Saikumar) సినిమా ‘ప్రేమ కావాలి’.. సాయితేజ్ (Sai Dharam Tej) సినిమా ‘రేయ్’ అని చెప్పేస్తారు. అయితే ముందు అనుకున్నవి అనుకున్నట్లు జరిగి ఉంటే పేర్లు అటు ఇటు వేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ‘ప్రేమ కావాలి’ కథ తొలుత సాయితేజ్ దగ్గరకు వచ్చింది. అలాగే ‘రేయ్’ కథ తొలుత ఆది సాయికుమార్ దగ్గరకు వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమాలు చేయలేదట.
2010 ఆ సమయంలో సాయి తేజ్ తొలి సినిమాను విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) దర్శకత్వంలో చేయాల్సింది. ఆ సినిమాను పవన్ కల్యాణ్ నిర్మించాల్సి ఉందట. ఆ సినిమానే ‘ప్రేమ కావాలి’. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ కథనే ఆది సాయికుమార్ హీరోగా చేసి మెప్పించారు. ఆ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఆదికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక అదే సమయంలో వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) ‘రేయ్’ సినిమాను ఆది సాయికుమార్‌తో చేయాలి అనుకుంటున్నారట.
కానీ ఆయన ఇటు వచ్చేయడంతో సాయితేజ్‌తో ఆ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచింది. ఇక్కడో విషయం ఏంటంటే.. హిట్ కొట్టి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆది సాయికుమార్ సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు డిజాస్టర్‌తో కెరీర్ ప్రారంభించిన సాయితేజ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే ఆశించిన ఫలితం అయితే రావడం లేదు.