పీరియాడికల్ డ్రామాలకు ఎప్పటికీ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుణ్ని ఇరవై, ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి అలరించే ప్రయత్నం చేస్తే బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. దానికి తాజా ఉదాహరణ ‘రంగస్థలం’. 1980ల నాటి అంశాల్ని, పరిస్థితుల్ని, స్థితిగతుల్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎంతటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. అందులో రామ్‌చరణ్ కష్టం ఎంతుందో, దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ అంతే ఉంది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో సుకుమార్ మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సారి దర్శకుడిగా కాదు, నిర్మాతగా.
సాయితేజ్ నటించిన ‘సోలో బతుకే సో బెటర్’ క్రిస్‌మస్ సందర్భంగా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక రాబోయే కొత్త సినిమాల సంగతి చూస్తే… కొణిదెల మేనల్లుడు గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 60 శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. అందులో సాయితేజ్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ సినిమాకు ఓకే చెప్పేశాడు. అదే ముందగా చెప్పిన 80ల నాటి సినిమా. సుకుమార్ రైటింగ్స్, బీవీఎస్ ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా అది.
1970, 80 నేపథ్యంలో సాగే కథ అని సాయితేజ్ చెప్పాడు. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతున్నాయట. ‘రంగస్థలం’ లాంటి కథ అని చెప్పలేం కానీ, ఆ టైమ్ సినిమా కాబట్టి అలాంటి మ్యాజిక్ రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులోనూ సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తుంది కాబట్టి… అతని ఇన్‌పుట్స్ ఎలానూ ఉంటాయి. కాబట్టి తేజు కెరీర్ మళ్లీ గాడిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే దేవా కట్టా సినిమా కూడా ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నదే. చూద్దాం ఏమవుతుందో?
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!