Sai Dharam Tej: రీమేక్‌లు చేయను అంటూనే ఆ సినిమా చేస్తానన్న సాయితేజ్‌!

రీమేక్‌ సినిమాలు చేయడం అంటే చాలా ఈజీ అనుకుంటారు. అయితే ఆ సినిమాలు చేసేంతప్పుడు వచ్చే సమస్య ఇంకెప్పుడూ రాదు అంటుంటారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు తీస్తే.. అదే తీశారు ఏముంది అంటారు. పోనీ ఏమైనా మార్పులు చేస్తే మాతృకలో ఉన్న పవర్‌ ఇందులో లేదు అంటుంటారు. అయితే ఇదంతా మేకర్స్‌ సమస్య. అయితే హీరోలకు కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే అది ఇంకో రకం. మాతృకలోని హీరోను కొత్త సినిమాలో హీరోతో పోలుస్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే… రీమేక్‌ గురించి ఓ హీరో మాట్లాడారు కాబట్టి.

టాలీవుడ్‌లో రీమేక్‌లు అంటే.. ముందుకొచ్చే హీరోల్లో పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్ ముందుంటారు. మిగిలిన హీరోలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా చేఆరు. ఎందుకంటే సాయితేజ్ కూడా రీమేక్స్‌కు వ్యతిరేకం అంటున్నాడు. మెగా కాంపౌండ్ హీరోలు వరుసపెట్టి రీమేక్స్ చేస్తుంటే అదే కాంపౌండ్‌కి చెందిన సాయితేజ్ (Sai Dharam Tej) ఇలా స్పందించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే అని చెప్పాలి.

నేను రీమేక్‌లు చేయను, భవిష్యత్తులో రీమేక్స్ ఆలోచన కూడా చేయను అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చేశాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడో కూడా చెప్పేశాడు. రీమేక్స్ చేయాలంటే హీరోకు ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అందుకే రీమేక్‌లు చేయాలని అనుకోవడం లేదు. పవన్ కల్యాణ్ సినిమాలు రీమేక్ చేస్తారా అంటే.. ఆ ఆలోచన అస్సలు లేదు అని చెప్పాడు. పవన్‌ సినిమా రీమేక్ చేసి అంచనాలు అందుకోవడం చాలా కష్టం. ఓ అభిమానిగా ఆ పని చేయలేను అని క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే మరీ చేయాలని అనుకుంటే కచ్చితంగా ‘తొలిప్రేమ’ సినిమాను రీమేక్ చేస్తానని చెప్పాడు సాయితేజ్‌. మరి ఈ దిశగా ఎవరైనా ఆలోచిస్తారా అనేది చూడాలి. అయితే ఇప్పుడు పాత సినిమాల్ని రీమేక్‌లు చేసే పరిస్థితి మన దగ్గర లేదు. అయితే గియితే సీక్వెల్స్‌, ప్రీక్వెల్స్‌ చేయాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus