Sai Pallavi,Mahesh Babu: మహేష్ బాబు ని చూడగానే మగాళ్లు ఇంత అందంగా ఉంటారా అనిపించింది: సాయి పల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపిన సాయి పల్లవి ప్రస్తుతం ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఫలానా హీరోతో నటించాలి అనే కోరికలు ఏమాత్రం లేవు. కథ బాగుంటే ఏ హీరోతో అయినా నటించడానికి తాను సిద్ధమేనని తెలిపారు.ఇక కొంతమంది దర్శకులు కథ చెప్పడానికి వచ్చి మీకు స్టార్ హీరోతో అవకాశం ఇస్తున్నామని అంటే ఆ హీరో ఎవరు అనే ప్రశ్న నేను వేయను. ఇలా దర్శకుడు నా దగ్గరకు వస్తే ముందుగా కథ మాత్రమే చెప్పమని అడుగుతానని సాయి పల్లవి తెలిపారు.

పరిశ్రమలో ఉండే హీరోలందరి పై నాకు ఎంతో గౌరవం ఉంది. అల్లు అర్జున్ డాన్స్ ఎంతో నచ్చుతుంది అలాగే మహేష్ బాబు స్క్రీన్ ప్రజెంట్ నాకు చాలా బాగా నచ్చుతుందని తెలిపారు.మొదటిసారి మహేష్ బాబుని చూసినప్పుడు అబ్బాయిలు ఏంటి ఇంత అందంగా కూడా ఉంటారా అని ఆశ్చర్యం కలిగింది అంటూ మహేష్ బాబు అందంపై సాయి పల్లవి క్రేజీ కామెంట్ చేశారు. ఇక అందరి హీరోయిన్లు మాదిరిగా సాయి పల్లవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు.

కేవలం తన సినిమాల సమయంలో మాత్రమే సినిమాలకు సంబంధించిన పోస్టులు చేస్తుంటారు.ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం నాకు నచ్చదు అదొక టైం వేస్ట్ వ్యవహారం అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక తనకు తెలుగులో లవ్ స్టోరీ ఫిదా సినిమాలు రెండు ఎంతో ప్రత్యేకమైనవి అందుకు శేఖర్ కమ్ముల గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని ఈమె తెలియజేశారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus