Sai Pallavi: కమర్షియల్ గా సాయిపల్లవికి సక్సెస్ దక్కుతుందా?

  • June 17, 2022 / 06:23 PM IST

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ఈ మధ్య కాలంలో నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్ ను అందుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది సాయిపల్లవి నటించి విడుదలైన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ కావడంలో సాయిపల్లవి కీలక పాత్ర పోషించారు. ఈరోజు సాయిపల్లవి కీలక పాత్రలో నటించిన విరాటపర్వం థియేటర్లలో విడుదలైంది. సాయిపల్లవి పాత్ర ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఈ సినిమాకు ఏకంగా 14 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడంతో కమర్షియల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి ఫ్యాన్స్ మాత్రం సాయిపల్లవి ఖాతాలో హ్యాట్రిక్ చేరిందని సంతోషిస్తున్నారు. విరాటపర్వం సినిమాకు సాయిపల్లవి నటించిన వెన్నెల పాత్ర హైలెట్ గా నిలిచింది. సాధారణ సన్నివేశాలను సైతం తన నటనతో సాయిపల్లవి మరో రేంజ్ కు తీసుకెళ్లారు.

విరాటపర్వం సాయిపల్లవి సినీ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోలకు జోడీగా సాయిపల్లవి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయిపల్లవికి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. సాయిపల్లవి రెమ్యునరేషన్ కంటే మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర హీరోయిన్లకు భిన్నంగా సాయిపల్లవి సినిమాల విషయంలో అడుగులు వేస్తున్నారు.

సాయిపల్లవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వరుసగా సక్సెస్ లు సాధిస్తున్నా సాయిపల్లవి రెమ్యునరేషన్ ను పెంచడానికి ఇష్టపడటం లేదు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus