టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే చాలా విషయాలలో భిన్నమనే సంగతి తెలిసిందే. పడిపడి లేచే మనసు సినిమా ఫ్లాపైతే ఆ సినిమాకు అడ్వాన్స్ కాకుండా మిగిలిన రెమ్యునరేషన్ వద్దని తన తల్లి చెప్పారని అయినా నిర్మాత తన రెమ్యునరేషన్ ను చెల్లించారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇతర విషయాల్లో సైతం సాయిపల్లవి నిర్మాతలపై భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఒక స్టార్ హీరోయిన్ తన రెమ్యునరేషన్ కాకుండా పర్సనల్ స్టాఫ్ ఖర్చుల కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే సాయిపల్లవి మాత్రం తన పర్సనల్ స్టాఫ్ ఖర్చులను కూడా సొంతంగా భరిస్తారని సమాచారం. ఈ విషయంలో సాయిపల్లవి గ్రేట్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి కథ నచ్చితే తక్కువ రెమ్యునరేషన్ కు కూడా ఓకే చెబుతారనే సంగతి తెలిసిందే. సాయిపల్లవికి సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతోంది. విరాటపర్వం సినిమా సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోలకు జోడీగా సాయిపల్లవికి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
సాయిపల్లవికి స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వస్తే ఆమె రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. బాలీవుడ్ నుంచి కూడా సాయిపల్లవికి సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. సాయిపల్లవి కమర్షియల్ యాడ్స్ కు కూడా దూరంగా ఉంటున్నారు. సినిమాలలో అవకాశాలు తగ్గిన తర్వాత డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని సాయిపల్లవి భావిస్తున్నారు.
సాయిపల్లవి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి సినిమాలలో ఎక్కువగా నటించాలని భావిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ తో సాయిపల్లవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం సాయిపల్లవి యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!