Sai Pallavi: వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి?

సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు నేచురల్ బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినిమాలలో ఎంతో సహజ సిద్ధంగా నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటిగా తెలుగు తమిళ భాషలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి చివరగా గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ ప్రొడక్షన్లో శివ కార్తికేయన్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈమధ్య కాలంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి సాయి పల్లవి తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Sai Pallavi) సాయి పల్లవి తన వృత్తిపరమైన జీవితం గురించి మాట్లాడుతూ తన వృత్తిని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఇష్టపడుతూ ఉంటానని తెలియజేశారు. పనిలో సంతోషాన్ని వెతుకున్నప్పుడే మనకు ఆ పని విషయంలో చాలా తృప్తి కలుగుతుందని తెలిపారు.అదేవిధంగా వృత్తిపరమైన జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు ముడి పెట్టకూడదని సాయి పల్లవి వెల్లడించారు.

తాను ఒకసారి షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెడితే తన ఫ్యామిలీ గురించి తన వ్యక్తిగత విషయాలన్నింటి గురించి మర్చిపోతానని తెలిపారు. ఇక ప్యాకప్ చేసుకున్న తర్వాత ఆ సినిమా గురించి షూటింగ్ గురించి ఏమాత్రం ఆలోచించనని తెలిపారు.ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా దృఢంగా ఉండగలం అంటూ ఈమె చెప్పినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus