Sai Pallavi: ఇన్ సెక్యూర్ గా ఫీలయ్యాను… డైరెక్టర్లు బలవంతం చేయలేదు!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి సినిమాలలో పెద్దగా మేకప్ వేసుకొని కనిపించరు. నాచురల్ గా సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈమె గత ఏడాది విడుదలైన గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తర్వాత సాయి పల్లవి తెలుగులో కూడా ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమైందని తన వైద్య వృత్తిలోనే కొనసాగుతుందని ఎన్నెన్నో వార్తలు వచ్చాయి అయితే తాజాగా సాయి పల్లవి ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తన అందం గురించి సాయి పల్లవి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తనకు మేకప్ వేసుకోవడం పెద్దగా ఆసక్తి ఉండదని చిన్నప్పటి నుంచి ఈ విషయంలో తను చాలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యే దానిని తెలిపారు.

ఇక ప్రేమమ్ సినిమా అవకాశం వచ్చినప్పుడు తన మొహంపై మొటిమలు ఉండటం తనని చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపారు.ఇక తనకు మేకప్ వేసుకోవడం ఇష్టం లేకపోవడంతో డైరెక్టర్లు కూడా ఈ విషయంలో తనని బలవంతం చేయలేదని సాయి పల్లవి తెలియజేశారు. ఇక ప్రేమమ్ సినిమా విడుదలవుతున్న సమయంలో తాను ఎంతో టెన్షన్ పడ్డానని ప్రేక్షకులు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆందోళన చెందానని తెలిపారు.

మరోవైపు తన వాయిస్ కూడా పెద్దగా బాగుండదని అందుకే తనకు చాలా టెన్షన్ కలిగిందని సాయి పల్లవి (Sai Pallavi) తెలిపారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సినిమాలలో అందం కన్నా నటన ప్రాధాన్యత ముఖ్యమని భావించాను.ఇలా ప్రేక్షకులు నన్ను ఆదరించడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని సాయి పల్లవి తెలిపారు. అందుకే అప్పటినుంచి మేకప్ వేసుకోవడం మానేశానని డైరెక్టర్లు కూడా నన్ను మేకప్ వేసుకోవాల్సిందేనని బలవంతం పెట్టలేదని తెలియజేశారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus