Sai Pallavi: సాయిపల్లవి కన్నీళ్లు.. నిర్మాత దగ్గరకు చెల్లి వెళ్లి చెప్పేసరికి.. ఏమైందంటే?

ఫేమ్ ఉన్నప్పుడే వరుస సినిమాలు చేసేయాలి.. ఆ తర్వాత ఏ మాత్రం తేడా కొట్టినా కెరీర్‌కే మోసం వచ్చేస్తుంది అని అంటుంటారు. ఈ మాట ఎక్కువగా హీరోయిన్ల గురించే చెబుతుంటారు కూడా. అందుకేనేమో కథానాయికలు కూడా ఫేమ్‌ ఉన్న సమయంలో వరుస సినిమాలు ఓకే చేసి.. షూటింగ్‌లకు డేట్స్‌ ఇచ్చేస్తుంటారు. అయితే దీని వెనుక చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. అందులో ఒకటి ప్రముఖ కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi) చెప్పుకొచ్చింది.

Sai Pallavi

వరుస సినిమాలతో అలరిస్తున్న సాయిపల్లవి (Sai Pallavi) ఆ మధ్య చిన్న గ్యాప్‌ తీసుకుంది. సినిమా ఛాన్స్‌లు వస్తున్నా, కథలు వింటున్నా వెంటనే ఓకే చేయలేదు. దీంతో పెళ్లి చేసుకుంటుందేమో అనే డౌట్‌ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల వేగం పెంచింది. ఇటీవల ‘అమరన్‌’తో (Amaran) ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయిపల్లవి.. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లోనే ‘తండేల్‌’ (Thandel) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే కొన్ని నెలల క్రితం గ్యాప్‌ ఎందుకు అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.

‘శ్యామ్‌ సింగ రాయ్‌’ (Shyam Singha Roy) సినిమా సమయంలో జరిగిన విషయాన్ని ఆమె ఇప్పుడు చెప్పడంతో.. ఆ గ్యాప్‌కు కారణం ఈ సినిమా సమయంలో జరిగిన విషయమా అనే డౌటనుమానం వస్తోంది. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ షూటింగ్ సమయంలో ఓ సందర్భంలో తీవ్ర మనోవేదనకు లోనై.. కన్నీటి పర్యంతమైనట్లు చెప్పింది. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందిపడినట్లు చెప్పారు.

‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో ఆ రోజు షూట్‌ పూర్తయితే ఆనందపడేదానినని చెప్పింది. తన సన్నివేశాలన్నీ రాత్రి పూటే చిత్రీకరించారని, తనకేమో రాత్రి షూటింగ్‌లు అంటే అలవాటు లేదని తెలిపింది. దానికితోడు ఆమెకు పగలు నాకు నిద్ర రాదట. దీంతో రాత్రిళ్లు షూటింగ్‌ సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించేది అని చెప్పింది. అలా 30 రోజులపాటు షూటింగ్‌ చేశారని తెలిపింది.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా షూటింగ్‌ ఒకవైపు చేస్తూనే, అప్పటికే ఓకే చేసిన ఇతర సినిమాల షూటింగ్స్‌లకు ఉదయాన్నే వెళ్లేదట సాయిపల్లవి. అలా విశ్రాంతి లేకుండా పని చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందట. ఆ సమయంలో ఒకరోజు రాత్రి నన్ను సాయిపల్లవిని చూడటానికి చెల్లి పూజా కన్నన్‌ వచ్చిందట. అప్పుడు విషయం చెబుతూ ఏడ్చేసిందట సాయిపల్లవి. దీంతో పూజా కన్నన్‌ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగిందట.

దానికి ఆయన ‘పది రోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావొచ్చు’ అన్నారట. ఈ లెక్కన ఆ రెస్ట్‌ లేకపోవడమే సాయిపల్లవి రీసెంట్‌ లాంగ్‌ గ్యాప్‌కి ఓ కారణం అవ్వొచ్చు అని అనిపిస్తోంది.

‘కంగువ’ స్టోరీ లైన్‌ చెప్పేసిన దర్శకుడు… కథ అంతా ఐదు చుట్టే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus