Sai Pallavi: సాయి పల్లవి బిజినెస్ మ్యాన్ ని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఆమె అంద చందాలతో పాటు నటన కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ లో ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా నటించిన ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పవచ్చు. అలాంటి సాయి పల్లవి మలయాళం లోని ప్రేమమ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ తో జత కట్టింది తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది. ఫిదా సినిమాలో భానుమతిగా సాయిపల్లవి పాత్ర ను ప్రతి అమ్మాయి ఇష్టపడుతోంది. ఈ సినిమాలో భానుమతి ఒక్కటే పీస్ హైబ్రీడ్ పిల్ల అనే డైలాగ్ ప్రతి అమ్మాయి సోషల్ మీడియాలో రీల్స్ చేశారంటే అర్ధం చేసుకొండి ఆ డైలాగ్ అమ్మాయిల మనస్సు లో నాటుకుపోయిందో.. ఈ మధ్యకాలంలో సాయిపల్లవి ఓ సినిమాకి ఎస్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయి విడుదలయ్యాక కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో వాళ్లకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

అప్పటివరకు తన (Sai Pallavi) పెళ్లి గురించి మాట్లాడకూడదని కండిషన్ పెట్టిందట. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికే ముప్పై ఏళ్లు పైగా ఉన్న సాయి పల్లవిని ఇంట్లో వాళ్ళు సినిమాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదట. రీసెంట్ గా ఒక సంబంధం వస్తే దాన్ని ఆమె రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

వచ్చిన సంబంధం కూడా బడా బిజినెస్ మ్యాన్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఇక సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామరస్ పాత్రల్లో నటించకుండా సావిత్రి సౌందర్య లాగా సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజుల్లో ఇలాంటి హీరోయిన్ ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus