తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన సాయి పల్లవి!
- October 31, 2016 / 09:00 AM ISTByFilmy Focus
ఒకే ఒక సినిమా ద్వారా మలయాళంలో ఫేమస్ అయిన నటి సాయి పల్లవి. మలయాళ ప్రేమమ్ చిత్రంలో ఆమె పోషించిన మలార్ పాత్ర యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో ఆమెకు దక్షిణాది భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. సాయి పల్లవి మాత్రం వైద్య విద్యను పూర్తి చేసేవరకు ఆగి, తనకు సూటయ్యే కథలను ఎంచుకుంది.
ప్రస్తుతం తెలుగులో ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు కథలను వింటోంది. తమిళ చిత్రాల్లో అడుగు పెట్టక ముందే అక్కడి మీడియా సాయి పల్లవి పై నెగిటివ్ గా కొన్ని వార్తలను ప్రచురిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగులు వద్దని, స్కిన్ షో చేయనని నిర్మాతలకు, డైరెక్టర్లకు కండిషన్లు పెడుతోందని విమర్శలు గుప్పుమన్నాయి. దీంతో అసహనానికి గురయిన నేచురల్ బ్యూటీ తనపై వచ్చిన వార్తలను ఖండించింది. ఇంకా తమిళంలో ఏ సినిమా మొదలు కాకముందే తనపై గాసిప్ లు రావడం బాధాకరమని వెల్లడించింది.
తన దగ్గరకు ఏ డైరక్టర్ డబుల్ మీనింగ్ ఉండే కథలతో రాలేదని, ఎక్స్ పోజింగ్ చేయమని ఏ నిర్మాత అడగలేదని సాయి పల్లవి స్పష్టం చేసింది. సౌత్ ఇండియన్ లోని అన్ని భాషల సినీ పరిశ్రమ వర్గాలలోని వారితో తనకు ఎలాంటి గొడవలు లేవని వివరించింది. ఈ మాటలు వింటుంటే వివాదాలకు దూరంగా, విజయాలకు దగ్గరిగా ఉండాలని సాయి పల్లవి పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.












