Sai Pallavi: సాయి పల్లవి రహస్యంగా ఇలాంటి పనులు కూడా చేస్తుందా?

సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీలో నటించినది చాలా తక్కువ సినిమాలలో ఆయనప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సాయి పల్లవి అద్భుతమైన నటి మాత్రమే కాకుండా మంచి డాన్సర్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. సాయి పల్లవితో పాటు డాన్స్ చేయాలి అంటే హీరోలు కూడా భారీగానే కష్టపడాల్సి ఉంటుంది. ఇలా తన సహజ నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకొని అలాంటి సినిమాలలో మాత్రమే నటిస్తారు.

స్టార్ హీరో పక్కన కథ ప్రాధాన్యత లేని సినిమా అవకాశాలు వచ్చిన ఈమె నిర్మొహమాటంగా నటించనని చెప్పేస్తారు ఇలా కథల విషయంలో ఆచితూచి అడుగులు వేసే సాయి పల్లవి నటించిన సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె తమిళంలో శివ కార్తికేయన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా తమిళ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో (Sai Pallavi) సాయి పల్లవి పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సాయి పల్లవి తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. అదేవిధంగా తనకు ఉన్నటువంటి ఒక విచిత్రమైన అలవాటు గురించి కూడా ఈమె తెలిపారు. సాయి పల్లవి ఎక్కడికి వెళ్లిన తనతోపాటు విభూతి వెంట తీసుకొని వెళ్తారట అయితే ఈమెకు ఆ విభూతిని తినడం ఎంతో ఇష్టమని తనకు ఉన్నటువంటి ఈ అలవాటు గురించి బయటపెట్టారు.

ఇలా విభూదిని తినడం తనకు చాలా ఇష్టమని అయితే ఆ విభూతి మాత్రం ఒక ప్రత్యేకమైన చెక్కతో తయారు చేస్తారని తెలిపారు. ఎంతో సువాసన భరితమైన రుచికరమైనటువంటి ఈ విభూతిని తాను తింటానంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా సాయి పల్లవికి విభూది తినే అలవాటు ఉందని తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus