సాయిపల్లవి గ్రేస్ ముందు నిలవలేకపోయిన నితిన్

ఫిలిమ్ ఇండస్ట్రీ అనే కాదు యావత్ ప్రపంచంలోనే మగాడి డామినేషన్ ఎక్కువగా నడుస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎదగడమే కాక స్టార్ హీరోల స్థాయి స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ సాయిపల్లవి. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె స్టేటస్ గురించి.

సాయిపల్లవి సంపాదించుకున్న స్టార్ డమ్ ఇప్పుడు నితిన్ నెత్తిన పిడుగుపడేలా చేసింది. నితిన్ తాజా చిత్రం “రంగ్ దే” చిత్రం నుండి కొత్త పాట “బస్టాండే బస్టాండే నీ బ్రతుకే బస్టాండే అనే పాట మొన్న విడుదలైంది. దేవిశ్రీప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాట వినడానికి క్యాచీగానే ఉంది. అయితే.. “బస్టాండ్” పాట విడుదలైన ఒకరోజు తర్వాత అంటే నిన్న ఉదయం “లవ్ స్టోరీ” నుండి సాయిపల్లవి సోలో సాంగ్ “సారంగ దరియా” విడుదలైంది. తెలంగాణ ఫోక్ సాంగ్ అయిన ఈ పాటను ఇప్పటికే నాలుగు సినిమాల్లో వాడేశారు.

అయినా కూడా శేఖర్ కమ్ముల బ్రాండింగ్ & సాయిపల్లవి స్క్రీన్ ప్రెజన్స్ వల్ల విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రెండ్ లిస్ట్ లోకి చొచ్చుకుపోయి.. నాలుగు గంటల్లోనే నెంబర్ 1 పొజిషన్ ను దొరకబుచ్చుకుంది. నిన్నటినుంచి మొదటి స్థానంలో తిష్ట వేయడంతోపాటు.. ప్రోమో కూడా ట్రెండ్ లిస్ట్ లోకి వచ్చేసింది. దాంతో నితిన్ “బస్టాండ్” పాట ట్రెండ్ లిస్ట్ లిస్ట్ లో స్థానం కూడా కోల్పోయి మూడు రోజులకి గాను కేవలం 2.5 మిలియన్ వ్యూస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోపక్క “సారంగ దరియా” పాట 7 మిలియన్ వ్యూస్ సాధించి సాయిపల్లవి స్టార్ డమ్ కు తార్కాణంగా నిలిచింది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus