చిరు, చరణ్ లతో నటించే ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ.. ఇప్పటి స్టార్ హీరోలకంటే జోరుమీదున్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే వారి కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి చిరు రెడీ అవుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరో 3 ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేశారు మెగాస్టార్. అందులో ఒకటి వినాయక్ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ కాగా.. మరొకటి మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ ఒకటి కావడం విశేషం. అప్పుడే ఈ చిత్రాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసినట్టు టాక్.

ఇందులో భాగంగా.. ‘వేదాలం’ రీమేక్ కోసం గుండుతో దిగిన ఓ ట్రయిల్ లుక్ ను.. చిరు నిన్న రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆలుమ డోలుమ అనే క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ఇదని సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి.దీంతో దర్శకుడు మెహర్ రమేష్ ను కొంతమంది ట్రోల్ చేస్తున్నప్పటికీ.. మరికొందరు సినిమా బాగానే ఉంటుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే.. ‘వేదాలం’ సినిమాలో అజిత్ చెల్లెలి పాత్ర చాలా కీలకం అన్న సంగతి తెలిసిందే.

తెలుగులో ఈ పాత్రకోసం స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదిస్తున్నారట. ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని టీం సభ్యులు భావిస్తున్నారని సమాచారం. అయితే చిరుకి చెల్లిగా చెయ్యడానికి ఆమె ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ చిత్రంలో చరణ్ పాత్రకు జోడీగా కూడా సాయి పల్లవిని సంప్రదిస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus