Sai Pallavi: సాయిపల్లవి ఓల్డ్‌ వీడియో వైరల్‌.. ఆ డ్యాన్స్‌ చూస్తే మతిపోవాల్సిందే!

సాయిపల్లవి (Sai Pallavi) బాగా డ్యాన్స్‌ చేస్తుంది… ఈ మాట ఎవరికైనా చెబితే… ఛస్‌ ఊరుకోండి ఏదైనా కొత్త విషయం చెప్పండి అని అంటారు. ఎందుకంటే ఆమె డ్యాన్స్‌ టాలెంట్‌ ఏంటో జనాలకు బాగా తెలుసు. చాలా ఏళ్ల క్రితమే ఈటీవీ ‘ఢీ’ డ్యాన్స్‌ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని అదరగొట్టింది. ఆ తర్వాత చాలా ఏళ్లు బుల్లితెరపై కనిపించని ఈ నేచురల్‌ అందం… ‘ప్రేమమ్‌’ అనే మలయాళం సినిమాతో వెండితెరపైకి వచ్చింది. అలా వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఏదో సినిమా చేస్తూనే ఉంది. భారీ విజయాలు సాధిస్తూనే ఉంది.

సినిమా టాక్‌ బాగోలేకపోయుండొచ్చు… ఆమె నటన గురించి కానీ, డ్యాన్స్‌ గురించి కానీ ఎవరూ వేలెత్తి చూపించే పరిస్థితి రాలేదు. ఇలా ఆమె గురించి రోజూ ఏదో టాపిక్‌ చర్చకు వస్తూనే ఉంటుంది. దానికి కారణం ఆమె ఇప్పుడు చేస్తున్న రెండు భారీ సినిమాలే. అయితే దీనికి కాస్త రిలీఫ్‌ ఇచ్చేలా ఆమె పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలా ఏళ్ల క్రితం కాలేజీ రోజుల్లో ఆమె ‘షీలా కీ జవానీ’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియో ఇది. ఆ వైరల్‌ వీడియోలో సాయిపల్లవి డ్యాన్స్‌ కి‘రాక్‌’ అంతే.

సాయిపల్లవి డ్యాన్స్‌ ఇరగదీసిన ఆ పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు, ఎలా బయటకు వచ్చిందన్న సంగతి తెలియడం లేదు కానీ ఆమె ఫ్యాన్స్‌ అయితే ‘ఇది రా మా మేడమ్‌ టాలెంట్‌.. సినిమాల్లోకి రాకముందే డ్యాన్స్‌లో అదరగొట్టేసేది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని పాత వీడియోలు ఉంటే కూడా షేర్‌ చేయండి అని మరికొందరు అడుగుతున్నారు.

ఇక సాయి పల్లవి సినిమాల సంగతి చూస్తే… తెలుగులో నాగచైతన్య (Naga Chaitanya) సరసన ‘తండేల్‌’ (Thandel) అనే సినిమాలో నటిస్తోంది. జాలర్ల నేపథ్యంలో సాగే ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇది కాకుండా మరో పాన్‌ ఇండియా సినిమా ‘రామాయణ’లో ఆమె సీత పాత్రలో నటిస్తోంది అంటున్నారు. అయితే ఈవిషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus