Sai Pallavi: సాయి పల్లవి సినిమాకు అతిపెద్ద చాలెంజ్!

ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణం ఆధారిత చిత్రం ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nitesh Tiwari) చేతిలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor i) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi ) సీతగా, యష్ ( Yash ) రావణుడిగా నటిస్తుండగా, యష్ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇది ఒక పెద్ద పాన్ ఇండియా చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. సన్నీ డియోల్ (Sunny De0l), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) , లారా దత్తా (Lara Dutta) వంటి ఇతర ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Sai Pallavi

అయితే, ఈ రామాయణం చిత్రీకరణలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రామాయణం వంటి పవిత్ర ఇతిహాసం ఆధారంగా సినిమా తీసేటప్పుడు దానికి తగిన శ్రద్ధ అవసరమని సూచిస్తున్నారు. రీసెంట్‌గా, ముంబైలో ఇండోర్ షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో రణబీర్, సాయి పల్లవి పాత్రల లుక్స్ కొన్ని లీక్ అవ్వడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రామాయణం నేపథ్యంగా వచ్చిన అనేక సినిమాలు విమర్శలు ఎదుర్కొన్నాయి.

2010లో వచ్చిన మణిరత్నం (Mani Ratnam) చిత్రం రావణ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గత ఏడాది విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ కూడా రామాయణాన్ని ఆధారంగా తీసుకున్నప్పటికీ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ముఖ్యంగా పాత్రల గెటప్స్, వీఎఫ్ఎక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొంది. ఇది కాకుండా రోహిత్ శెట్టి (Rohit Shetty) సింగం అగైన్ (Singham Again) కూడా రామాయణం స్టోరీ లైన్ తో వచ్చినా ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రామాయణం పూర్తి కథను ఒక ప్రాజెక్ట్ చేస్తున్న మేకర్స్ మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

ప్రతి అంశంలో ప్రాముఖ్యత ఇవ్వాలని, హిందూ ఆడియన్స్‌తో బాగా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలనే నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రామాయణం చిత్రం ఈ సవాళ్లను ఎంతవరకు అధిగమిస్తుందో, సాయి పల్లవి, రణబీర్, యష్ వంటి స్టార్ కాస్టింగ్‌తో ఈ ప్రాజెక్ట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

పవన్ కళ్యాణ్ – సౌందర్య.. ఆ కాంబో ఎలా మిస్సయిందంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus