Sai Tej, Pawan Kalyan: అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. అంటూ సాయితేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. క్షణాల్లో వైరల్‌

ఒక కల నెరవేరింది.. ఇది మరపురాని రోజు.. ఈ మెమొరీని జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను… ఇంత బరువైన మాటలు అర్ధరాత్రి ఓ కుర్రాడు చెబుతున్నాడు అంటే ఎంతటి ఎమోషనల్‌ అయ్యుంటాడో చూడండి. ఈ మాటలు చెప్పింది యువ హీరో సాయిధరమ్‌ తేజ్‌. కారణం ఆయన తన మావయ్యతో కలసి నటించిన సినిమా ఈ రోజు విడుదల అవుతుండటమే. పవన్‌ కల్యాణ్ – సాయిధరమ్‌ తేజ్‌ కలసి నటించిన ‘బ్రో’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రాసిన పోస్ట్‌ ఇలా ట్వీట్‌ చేశాడో లేదో అలా వైరల్‌ అయిపోయింది.

ఎమోషనల్‌ లెటర్‌ ఒకటే కాదు.. దాంతో సాయితేజ్‌ షేర్‌ చేసిన ఫొటో కూడా అదిరిపోయింది. అందులో సాయితేజ్‌కు పవన్‌ కల్యాణ్‌ బేబీ సిట్టర్‌లా ఉన్నాడు. సాయితేజ్‌ చిన్నతనం నుండి పవన్‌ దగ్గరుండి చూసుకున్నాడని చాలాసార్లు చెబితే విన్నాం. ఇప్పుడు మనం ఈ ఫొటోలో చూడొచ్చు. పిల్లాడిని ఆడిస్తూ ఆడిస్తూ ఎటూ వెళ్లకుండా రెండు కాళ్ల మధ్యలో పెట్టి పవన్‌ నిద్రపోతున్న ఫొటో అది. ఆ ఫొటో గురించి వివరిస్తే మాటలు సరిపోవు కానీ..

చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది. (Sai Tej) సాయితేజ్‌, టెడ్డీతో పవన్‌ ఉన్న ఆ పిక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక లెటర్‌ గురించి చూస్తే.. ‘‘నేను నా మనసులోని ప్రతి భావాన్ని రాయాలని అనుకుంటున్నారు. నా గురువు, నా మామ, నా మావయ్య ఇంకా నా సర్వస్వం అయిన పవన్‌ కల్యాణ్‌ మామతోతో కలసి స్క్రీన్‌ షేర్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో నటించడం మరపురాని విషయం. ఈ విషయంలో నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు.

నా కలను నిజం చేసినందుకు థ్యాంక్స్‌. అలాగే సముద్రఖని, విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల, పీపుల్‌ మీడియా… ఇలా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చాడు సాయితేజ్‌. నా ముగ్గురు మావయ్యలు, వాళ్ల అభిమానులు, నా కుటుంబం, అందరి హీరోల ఫ్యాన్స్‌, సినిమా ప్రేమికులు.. ఇలా అందరూ నన్ను సపోర్టు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ‘బ్రో’ సినిమా నాది ఎలాగో, మీది కూడా. ఈ సినిమాను చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు అని నోట్‌లో పేర్కొన్నాడు సాయి ధరమ్‌ తేజ్‌.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus