‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యర్నేని,రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ అందించిన కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 12 న విడుదల కాబోతుంది. సాయి తేజ్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురేజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్, పాటలతో ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయ్యింది. సాయి తేజ్ కి 6 ప్లాపులు పడినప్పటికీ ఈ చిత్రానికి డీసెంట్ బిజినెస్ జరగడం విశేషం. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈస్ట్ – 0.96 కోట్లు
కృష్ణా – 0.90 కోట్లు
గుంటూరు – 1.10 కోట్లు
వెస్ట్ – 0.84 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 10.60 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 1.0 కోట్లు
ఓవర్సీస్ – 1.40 కోట్లు
————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 13 కోట్లు
————————————————–
‘చిత్రలహరి’ చిత్రం పై తేజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుసగా ఆరు ప్లాపులతో వెనుకపడ్డాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన పాటలు, టీజర్, ట్రైలర్ లు చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 12 న విడుదలవుతుంది.. దానికి ముందు రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలెక్షన్ల హడావిడి కూడా ముగుస్తుంది కాబట్టి ‘చిత్రలహరి’ కి కలిసొచ్చే అవకాశం. ఇక అదే రోజున మోహన్ లాల్ ‘లూసిఫర్’ చిత్రం విడుదలవుతుంది. అది తేజు చిత్రానికి పెద్ద పోటీ ఏమీ కాదు. ఇక ‘మజిలీ’ చిత్రం ఊపు కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది.. సో ఏమాత్రం ‘చిత్రలహరి’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఖాయం. ఒక వేళ యావరేజ్ టాక్ వచ్చినా మొదటి వారానికైనా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా తేజు కి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.