ఆ సినిమా తీసింది నేనే అని చెప్పుకోవాల్సి వస్తోంది!

రీమేక్‌ సినిమాలు చేయడం చాలా ఈజీ.. అక్కడున్నది యాజ్‌ ఇట్‌ ఈజ్‌ చేయడమే.. కొంతమంది ఇలా కామెంట్‌ చేస్తారు. ఇంకొంతమంది అయితే ఉన్నది ఉన్నట్లుగా తీస్తే ఇక్కడివాళ్లకు నచ్చదు అందుకే మార్పులు అవసరం అని మారుస్తారు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ దర్శకులకు ఇబ్బంది వస్తుంది. అవేంటి అనేది తర్వాత చూస్తే.. రీమేక్‌ చేయడం వల్ల ఓ దర్శకుడు తిట్లు కాశారట. ఆ విషయాన్ని ఆయనే ఇటీవల చెప్పుకొచ్చారు.

విశ్వక్‌సేన్‌ హీరోగా తెలుగులో వచ్చిన ‘హిట్‌’ సినిమాను బాలీవుడ్‌ అదే పేరుతో దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించారు. ఆ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే.. ఆ సినిమా వల్ల ఆయన అక్కడి ప్రేక్షకులతో తిట్లు కాశారట. వాటికి ఆయన ఎంతగా నొచ్చుకున్నారు అంటే.. ఇకపై రీమేక్‌ కథలు చేయను అని చెప్పేంత. ‘హిట్‌’ సినిమా అక్కడ చేస్తే.. ‘దక్షిణాదిలో ఎవరో ఓ మంచి కథ రాసి చేస్తే, దాన్ని ఇక్కడ రీమేక్‌ చేస్తున్నాడు చూడు’ అన్నారట. దీంతో అక్కడ కూడా తీసింది నేనే అని చెప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పారు శైలేష్‌.

అయితే హిందీలో ‘హిట్‌’ కథల్నే చేయాలనుకుంటే, మరో కొత్త కథని తీస్తాను తప్ప అదే కథను చేయను అని చెప్పారు. ఎందుకంటే మన సినిమాల్ని హిందీ బెల్ట్‌లో ఓటీటీల్లో ముందే చూసేస్తున్నారు అని చెప్పారు శైలేష్‌. దాంతోపాటు తర్వాతి సినిమాల విషయంలోనూ శైలేష్‌ చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. తదుపరి మీరు చేయబోయే సినిమా ‘హిట్‌’ ఫ్రాంచైజీలోనే ఉంటుందా? అని అడిగితే.. వేరే కథలు సిద్ధంగా ఉన్నాయి. డైలాగ్స్‌తో సహా 3 కథలు సిద్ధం చేసి పెట్టుకున్నా.

అయితే ‘హిట్‌’ ఫ్రాంచైజీని కొనసాగించాలంటే నేను వేరే కథలకు దూరం కావాల్సి వస్తుంది. అయితే డిసెంబరు 2న ‘హిట్‌ 2’ సినిమా విడుదలయ్యాక నా నిర్ణయంపై స్పష్టత వస్తుంది అని చెప్పారు. ఈ లెక్కన ‘హిట్‌ 3’ హీరోను ‘హిట్‌ 2’ ఆఖరున చూపించినా.. ‘హిట్ 2’ హిట్‌ అయితేనే.. ‘హిట్‌ 3’ వెంటనే మొదలవుతుంది అని చెప్పొచ్చు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus