‘బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్.. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవేవి కూడా అభిమానులను ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ సాధించింది అంటూ ఏమీ లేదు. కానీ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా మాత్రం స్ట్రాంగ్ గా ఉందని ప్రూవ్ చేశాయి. అవి మూడు కూడా ప్రభాస్ ఇమేజ్ కి భిన్నమైన సినిమాలు అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్లో పెర్ఫార్మ్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.
అయితే ఈసారి ప్రభాస్ మార్క్ మాస్ అండ్ యాక్షన్ మూవీ రానుంది. అదే ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా వారి ఆకలి తీరుస్తుంది అని ఇండస్ట్రీలో కూడా నమ్మకమైన కామెంట్లు వినిపించాయి. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. కానీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్.. వంటివి ప్రేక్షకులను కానీ అభిమానులను కానీ పూర్తి స్థాయిలో అలరించింది లేదు.
మరోపక్క మేకర్స్ కూడా ప్రమోషన్ మొదలుపెట్టలేదు. దీంతో ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోయింది. కానీ ఉన్నట్టుండి కొన్ని పెద్ద సంస్థలు.. సడన్ గా ‘సలార్’ ని లేపే ప్రయత్నం చేస్తున్నాయి. తమకు తెలిసిన.. నమ్మకమైన వ్యక్తులు ‘సలార్’ సినిమా చూడటం జరిగింది అని, కచ్చితంగా ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతుందని, ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ ఫీస్ట్ ఇస్తుందని అంటున్నారు.యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోయాయట.
ప్రేక్షకులు కథకి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే టీజర్, ట్రైలర్..లలో హీరోని ఎక్కువ సేపు చూపించలేదు అని, సినిమా చూశాక అందరూ ప్రశాంత్ నీల్ ని మెచ్చుకుంటారని.. ఆ సంస్థలు కథనాలు రాసుకొస్తున్నాయి. ఇదంతా వారు నిజాయితీగా చెబుతున్నారా..లేక దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా అనేది .. ‘సలార్’ ని చూస్తేనే కానీ చెప్పలేం. ప్రస్తుతానికైతే కొన్ని సంస్థలు (Salaar) ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ ను ప్రమోషన్ చేయనవసరం లేనంతగా లేపుతున్నాయి అనేది వాస్తవం