Prabhas: సలార్ పై ఆ వార్తల వెనుక అసలు కారణాలివే?

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్ లతో బిజీగా ఉంటూనే తను హీరోగా తెరకెక్కిన సినిమాలు ఏడాదికి ఒకటి లేదా రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద సలార్ సంచలనం సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Click Here To Watch

అయితే ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలు వైరల్ కావడం వెనుక ఈ సినిమా బడ్జెట్ కారణమని సమాచారం. ఎక్కువ మొత్తం ఖర్చు కావడంతో రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది మేకర్స్ కు సలహా ఇచ్చినట్టు బోగట్టా. అయితే మేకర్స్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ సినిమాను ఒకే పార్ట్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అన్ని సినిమాల బడ్జెట్ 1,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్2 తర్వాత తెరకెక్కిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.

సలార్ సినిమాలోని యాక్షన్ సీన్ల కోసం మేకర్స్ భారీ మొత్తం ఖర్చు చేశారని తెలుస్తోంది. సలార్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో సలార్ స్పెషల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus