Prabhas: సలార్ పై అంచనాలు పెంచుతున్న న్యూస్ ఇదే!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారనే సంగతి తెలిసిందే. బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన సంచలన రికార్డులను, ఇతర రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కేజీఎఫ్2 సంచలన విజయం సాధించడంతో సలార్ రికార్డులు క్రియేట్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సలార్ ప్రీ క్లైమాక్స్ కు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుండగా ఆ వార్త సలార్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

Click Here To Watch NOW

సలార్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను లోయలో షూట్ చేశారని 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ యాక్షన్ సీన్ కు సంబంధించిన షూట్ పూర్తైందని బోగట్టా. భయంకరమైన లోయలో ఛేజింగ్ సన్నివేశాలతో ఈ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. సలార్ మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని బోగట్టా.

యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సలార్ రెగ్యులర్ షూటింగ్ మే నెల 1వ తేదీ నుంచి మొదలుకానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ను అభిమానులు ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో అదే విధంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. సలార్ సినిమా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.

వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. సలార్ మూవీకి భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus