ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం సాధారణం అయింది. సలార్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయల కంటే బిజినెస్ జరగగా ఏపీలో 75 రూపాయలు టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలని సలార్ మేకర్స్ కోరారని సమాచారం. సలార్ సినిమాకు అనుమతులు సులువుగానే లభించే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సలార్ మూవీ టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఒక్కో టికెట్ కు 200 రూపాయల నుంచి 350 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రభాస్ గత సినిమాలైన ఆదిపురుష్, రాధేశ్యామ్ సైతం ఎక్కువ టికెట్ రేట్లతోనే థియేటర్లలో విడుదలయ్యాయి. టికెట్ రేట్ల పెంపు వల్ల సలార్ డే1 కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ మూవీ కోసం ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు మాత్రం భారం పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సలార్ సినిమా అద్భుతంగా ఉంటే మాత్రం టికెట్ రేటు కొంతమేర ఎక్కువగా ఉన్నా తమకు సమస్య కాదని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సలార్2 రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సలార్ మూవీ ట్రైలర్ కు సంబంధించిన పనులు జరుగుతుండగా డిసెంబర్ 1వ తేదీన విడుదల కానున్న ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.
సలార్ (Salaar) సినిమాలో ప్రభాస్ లుక్ అదిరిపోయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్, సలార్2 బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలు అవుతాయని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సలార్ మేకర్స్ ప్రమోషన్స్ కు సంబంధించి భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. బిజినెస్ భారీ స్థాయిలో జరగడంతో మేకర్స్ ఎంతో సంతోషిస్తున్నారని భోగట్టా.