విడుదలకు ముందే విన్నర్ గా నిలుస్తున్న సలార్.. ఏం జరిగిందంటే?

  • December 10, 2023 / 04:01 PM IST

సలార్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ ప్రభాస్ అభిమానులలో టెన్షన్ ఒకింత పెరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి షూటింగ్ తో బిజీగా ఉండగా సలార్ ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటారో లేదో తెలియాల్సి ఉంది. అయితే సలార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ గా జరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుంది.

ఆస్ట్రేలియాలో సలార్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 69 వేల రూపాయలు రాగా డంకీ మూవీకి మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6 వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. ప్రభాస్ సినిమా పైచేయి సాధిస్తుండటం డంకీ సినిమాను తెగ టెన్షన్ పెడుతోంది. విడుదలకు ముందే విన్నర్ గా నిలుస్తున్న సలార్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సలార్ మూవీ కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

ప్రశాంత్ నీల్ గత సినిమాలను మించేలా ఈ సినిమా ఉండనుందని రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో సెన్సేషనల్ కాంబో కాగా ఈ కాంబో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సలార్ సక్సెస్ సాధిస్తే ప్రభాస్, ప్రశాంత్ పారితోషికాలు సైతం భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సలార్ సినిమా దాదాపుగా 3 గంటల నిడివితో థియేటర్లలో విడుదల కానుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సలార్ (Salaar) మూవీలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus