Salaar: సినిమా టీమ్‌ అప్‌డేట్‌ ఇవ్వడం లేదని… ఫ్యాన్సే రిలీజ్‌ చేశారు.. చూశారా!

ఫ్యాన్స్‌ రెండు రకాలు అని మనం వింటూ ఉంటాం. ఒకటి సినిమా అప్‌డేట్‌ కోసం ఆగేవాళ్లు. రెండు అప్‌డేట్‌ కోసం రోడ్డెక్కి గోల చేసేవాళ్లు. అయితే ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం కూడా ఉన్నారు. వాళ్లే సినిమా టీమ్‌ అనుకుని ఓ అప్‌డేట్‌ ఇచ్చేవాళ్లు. ఏంటీ కన్‌ఫ్యూజ్‌గా ఉందా? మొన్నటికి మొన్న ‘పుష్ప 2’ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంత హడావుడి చేశారో చూశాం కదా. ఇప్పుడు మరో రకం ఫ్యాన్స్‌ గురించి చెబుతున్నాం. వీళ్లు అప్‌డేట్‌ రిలీజ్‌ చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారు.

మేం చెబుతున్నది ప్రభాస్‌ అభిమానుల కోసమే. ప్రభాస్‌ నుండి త్వరలో ‘సలార్‌’ అనే సినిమా రాబోతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీస్‌ఫైర్’ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ నుండి ఏదైనా పాట, పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌ వస్తాయేమో అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌, ఆ మాటకొస్తే ప్రశాంత్‌ నీల్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. సాధారణ రోజుల సంగతి పక్కన పెడదాం. ఆగస్టు 15 లాంటి స్పెషల్‌ డేస్‌లో కూడా రాలేదు ప్రభాస్‌ అభిమానులు బాధపడుతున్నారు.

ఇప్పటికే వచ్చిన టీజర్‌లో ప్రభాస్‌ను చూపించకుండా కేవలం టినూ ఆనంద్‌తో ‘సలార్‌’ పాత్రను వివరించడం ఫ్యాన్స్‌కి నచ్చలేదు. టీజర్‌లో ప్రభాస్‌ కటౌట్‌ ఉండాల్సిందే అన్నారు. కనీసం ఆ ఆగ్రహాన్ని అయినా తగ్గించేలా టీమ్‌ ప్రచారం మొదలుపెట్టలేదు. దీంతో అభిమానుల్లో ఒకరు టైటిల్‌ సాంగ్‌ను రెడీ చేసి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసేశారు. ఇప్పుడు ఈ ఫ్యాన్‌ మేడ్‌ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. సాహిత్యం, ట్యూన్ చూస్తే అస్సలు ఫ్యాన్‌ మేడ్‌లా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఈ పాటను (Salaar) ‘సలార్’ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఫ్యాన్ మేడ్ సాంగ్ అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌ చూసి… మీరు రిలీజ్‌ చేయకుండా ఫ్యాన్‌ మేడ్‌ సాంగ్‌ని ప్రశంసించి… ఏం చేద్దామని అంటూ అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు. విడుదలకు ఇంకా నెల ఉంటే.. ప్రచారాలు లేకుండా ఏంటిది అంటున్నారు. మరి ఈ విషయంలో ‘సలార్‌’ టీమ్‌ ఏమంటుందో చూడాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus