సల్మాన్ ఖాన్‌కి(Salman Khan) దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే నార్త్‌లో ఎక్కువ ఉంటారు, సౌత్‌లో తక్కువ ఉంటారు. ఎందుకంటే మొన్నటివరకు నార్త్ స్టార్‌లు ఎవరూ దక్షిణాది సినిమాను పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి. ఇప్పుడిప్పుడు గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతోంది వాళ్లకు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే మేమే అనుకునేవాళ్లు కదా. ఆ విషయం వదిలేస్తే తాజాగా దక్షిణాది సినిమా ప్రేక్షకులపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తాను రోడ్లపై కనిపిస్తే ‘భాయ్.. భాయ్’ అంటూ సౌత్ సినిమా అభిమానులు ప్రేమ చూపిస్తారు కానీ.. ఆ అభిమానం థియేటర్ల వరకు రావడం లేదు అనేది సల్మాన్ ఖాన్ చెప్పిన మాట. సౌత్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘సికందర్’ సినిమా ప్రచారం కోసం సల్మాన్ ఓ మీడియాతో మాట్లాడుతూ ‘సికందర్’ (Sikandar) సినిమా విశేషాలతో పాటు దక్షిణాది సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), సూర్య (Suriya), రామ్ చరణ్ (Ram Charan) సినిమాలు ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో కూడా ఆదరణ దక్కించుకుంటున్నాయి.
భారీ వసూళ్లు కూడా సాధిస్తున్నాయి. నార్త్ ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి వారి సినిమాల్ని చూస్తున్నారు కాబట్టే. కానీ సౌత్ అభిమానులు మాత్రం హిందీ సినిమాల విసయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు. దక్షిణాది అభిమానులు మాపై చూపిస్తున్న ప్రేమను థియేటర్ వరకు తీసుకురావడం లేదు అని అన్నాడు. ఒక విధంగా సల్మాన్ ఖాన్ చెప్పిన మాట నిజమే. అయితే మంచి సినిమాలు తీస్తేనే విజయాలు వస్తాయి అని సల్మాన్ అన్నాడు.
ఇప్పుడు వాళ్లకు విజయాలు రావడం లేదు. అంటే మంచి సినిమాలు తీయడం లేదు అనేగా. ఆ లెక్కన మంచి సినిమాలు తీయకుండా సౌత్ అభిమానులు ఎందుకు నార్త్ సినిమాలను ఆదరిస్తారు. మంచి సినిమాలు తీస్తే అందరూ చూస్తారు అనడానికి ‘ఛావా’ సినిమానే ఒక ఉదాహరణ. కాబట్టి సల్మాన్‌కు ఇంకా గ్రౌండ్ రియాలిటీ అర్థం కావడం లేదు. చూద్దాం సల్మాన్ కామెంట్స్ నేపథ్యంలో మరి ‘సికందర్’ను సౌత్ పట్టించుకుంటుందో?