తాను సినిమాల్లోకి వస్తాను అని చెప్పినప్పుడు తన తండ్రి నటన మాత్రమే ఎందుకు అని అడిగారు అని ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చెప్పాడు. తాజాగా ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కెరీర్ గురించి, తన జైలు రోజుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎందుకంటే జైలులో ఓ విషయం బాగుంది అని చెప్పడమే. సాధారణంగా తాను రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతానని, నెలకోసారి మాత్రం ఓ రోజు ఎనిమిది గంటలు పడుకుంటానని సల్మాన్ ఖాన్ చెప్పాడు.
కొన్నిసార్లు సినిమా షూటింగ్ గ్యాప్లో కునుకు తీస్తానని చెప్పాడు సల్మాన్. షూటింగ్‌లు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్ర పోతానని చెప్పాడు. అలా తాను గతంలో జైలుకి వెళ్లినప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయానని చెప్పాడు. అంతేకాదు తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య వస్తే తాను మాత్రం ఎంచక్కా నిద్రపోతా అని చెప్పాడు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఏమీ చేయలేం కదా అని చెప్పాడు.
అలా తను లైఫ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చెప్పాడు సల్మాన్. ఇక అసలు విషయానికొస్తే.. ఇండస్ట్రీకి వస్తా అని తొలుత తన తండ్రి దగ్గ చెబితే.. ‘నువ్వు యాక్షన్ చేయగలవా? అని అడిగారట.లాయర్, పోలీస్ ఇలా ఏదో ఒకటి కావచ్చు కదా అని అన్నారట. కానీ తాను మాత్రం నటుడిని కావాలని బలంగా కోరుకున్నానని చెప్పాడు.
ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉంటుందని, జీవితంలో సీరియస్‌గా ఉంటూ… తోటి నటులతో కంపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అనుకున్నానని, ఇప్పుడు అదే చేస్తున్నా అని చెప్పాడు సల్మాన్. ఇక సల్మాన్ ప్రస్తుత సినిమాలు చూస్తే.. మురుగదాస్ (A.R. Murugadoss) డైరక్షన్‌లో ‘సికందర్’లో (Sikandar) నటిస్తున్నాడు. రష్మిక మందన (Rashmika Mandanna) అందులో నాయిక. రంజాన్ కానుకగా మార్చి 28న సినిమాను రిలీజ్ చేయనున్నారు.