‘గాడ్ ఫాదర్’ గురించి సోషల్ మీడియాలో ఎటు చూసినా నెగిటివ్ వాసనలే వస్తున్నాయి. కారణం ఆ సినిమాకు సరైన ప్రచారం చేయకపోవడం, చేసిన అరకొర ప్రచారంలో నాణ్యత లేకపోవడమే. అయితే అలాంటి బజ్‌లెస్ ప్రమోషన్స్, హైప్ మధ్యలో ఓ పాజిటివ్ వార్త ఒకటి బయటికొచ్చింది. అదే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్. ఈ సినిమా ఓటీటీ, టీవీ హక్కల విషయంలో పాజిటివ్ అంశాలు కొన్ని బయటకు వచ్చాయి. దాని బట్టి చూస్తే.. బజ్‌తో సంబంధం లేకుండా బిజినెస్ జరిగింది అనుకోవచ్చు.
అయితే దీనికి కారణం చిరంజీవి మాత్రమే కాదు అంటున్నారు. అదేంటి చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమా బిజినెస్‌కి చిరంజీవి కారణం కాకుండా వేరొకరు కారణమా అనుకుంటున్నారా? అవును చిరంజీవికి భాయ్ సపోర్టు వల్లనే మంచి రేటు పలుకుతోంది అంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ టీవీ రైట్స్ ద్వారా సుమారు రూ. 60 కోట్ల నుండి రూ. 70 కోట్ల వరకు దక్కాయట. అలాగే ఓటీటీ హక్కుల కింద నెట్‌ఫ్లిక్స్ నుండి మరో రూ. 60 కోట్ల వరకు వచ్చాయి అని చెబుతున్నారు.
ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అయితే రూ. 90 కోట్ల నుండి రూ. 100 కోట్లు పలికాయని టాక్. ఆ విధంగా సల్మాన్ ఖాన్.. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’కు మంచి ధర పలికేలా చేశాడు అని అంటున్నారు. దీంతో ఈ మార్కెటింగ్ ప్లానింగ్‌ను ముందుగానే ఆలోచించి చిరంజీవి అండ్ కో. సల్మాన్‌ను ‘గాడ్‌ఫాదర్’లో తీసుకున్నారు అని అంటున్నారు. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.
సినిమా టీజర్‌ను రెండు భాషల్లో విడుదల చేసింది చిత్రబృందం. మొన్న వచ్చిన సాంగ్‌లోనూ సల్మాన్‌ను కీలకంగా చూపించారు. త్వరలో వచ్చే ట్రైలర్‌లోనూ ఇదే కొనసాగొచ్చు. దీంతో ‘గాడ్‌ఫాదర్’కి సల్మాన్ బంగారు బాతు అనుకోవచ్చు. మరి బాతు ఏం చేస్తుంది అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమా హిట్టయితే సల్మాన్‌కి కూడా మంచి లాభమే.