Salman Khan: టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గానే ప్లాన్ చేసుకున్నాడు.. సల్మాన్ ఖాన్ డెసిషన్ సూపర్..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు అక్కడే రూ.300 కోట్ల మార్కెట్ వరకు ఉంది. అతనితో ఏ సినిమా చేసినా అలవోకగా అది రూ.150 కోట్లు వసూల్ చేస్తుంది. అయితే కరోనా వల్ల బాలీవుడ్ మార్కెట్ బాగా దెబ్బతింది. దాంతో అక్కడి హీరోలు పాన్ ఇండియా సినిమాల్లో నటించాలని తద్వారా మిగిలిన భాషల్లో కూడా మార్కెట్ ఏర్పరుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీని కూడా భారీగానే ప్లాన్ చేసుకున్నాడు.

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ నటిస్తున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న తమన్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు కానీ దర్శకుడు కానీ చిరు కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘అన్తిమ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. చిరు సినిమాలో మాత్రమే కాదు వెంకటేష్ హీరోగా నటించే మరో సినిమాలో కూడా నటించబోతున్నట్టు సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు.

దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చిరు అయితే చాలా సినిమాల్లో నటిస్తున్నారు. మరి వెంకీ నటిస్తున్న ఏ సినిమాలో సల్మాన్ నటించబోతున్నాడు అనే డిస్కషన్లు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగులో స్ట్రైట్ సినిమా చేయకపోయినా సల్మాన్ ఖాన్ కు ఇక్కడ రూ.3 కోట్ల థియేట్రికల్ మార్కెట్ ఉంది. స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటిస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Share.