Salman Khan, Venkatesh, Ram Charan: సల్మాన్‌ సినిమాలో వెంకీతోపాటు చరణ్‌ కూడానట!

ఇదేంటి… సల్మాన్‌తో చరణ్‌ స్టెప్పులా? చిరంజీవితో కదా సల్మాన్‌ ఖాన్‌ స్టెప్పులేసిది ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో అని అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. చిరంజీవితో సల్మాన్‌ స్టెప్పులేస్తారు, అయితే సల్మాన్‌తో చరణ్‌ కూడా స్టెప్పులేస్తున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ వార్తే వైరల్‌గా మారింది. కారణం ‘ఆచార్య’ సెట్‌లో సల్మాన్‌ ఖాన్‌, రామ్‌చరణ్‌ ఉండటం, అంతేకాదు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుండటమే అంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. వార్త అయితే వైరల్‌ అయ్యింది.

సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్స్‌లో ఓవైపు చిత్రీకరణ జరుగుతుండగా, మరోవైపు ‘ఆచార్య’ సినిమా ధర్మస్థలి సెట్‌లో కూడా చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌, రామ్‌చరణ్‌ మీద ఓ పాట చిత్రీకరించారని టాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ పూర్తయిందని కొందరు అంటుంటే, మరికొందరేమో తవరలో షూట్‌ ఉంటుందని చెబుతున్నారు.

ఒకవేళ ఇదే జరిగితే ఓ సినిమాలో చిరంజీవితో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తుంటే, మరో సినిమాలో సల్మాన్‌ ఖాన్‌తో రామ్‌చరణ్‌ నటిస్తున్నాడన్నమాట. ఇక ‘కబీ ఈద్…’ సినిమాలో వెంకటేశ్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్డే సోదరుడిగా వెంకటేశ్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కూడా హైదరాబాద్‌లోనే పూర్తి చేస్తున్నారని సమాచారం. వెంకటేశ్‌ పాత్రకు సంబంధించిన సమాచారం ఇప్పటికే అఫీషియల్‌గా వచ్చినా రామ్‌చరణ్‌ విషయం మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

ఈ సినిమా ‘వీరమ్‌’ / ‘కాటమరాయుడు’ సినిమాకు రీమేక్‌ అని అంటున్నారు. అయితే ఈ విషయంలో అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ‘వీరమ్‌’ తెలుగు రీమేక్‌ ‘కాటమరాయుడు’ సరైన విజయం అందుకోలేదు. మరి హిందీలో ఆ రీమేక్‌ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. సౌత్‌ యాక్టర్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్న సల్మాన్‌ ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటాడేమో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus