అమ్మకు అవన్నీ చెప్పి బాధపెట్టను : సమంత
- May 15, 2017 / 10:46 AM ISTByFilmy Focus
మాతృదినోత్సవాన్ని నిన్న అందరూ సంతోషంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా తల్లితో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అలా విషెష్ చెప్పిన వారిలో టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత కూడా ఉన్నారు. ఆమె తన అమ్మ నినెట్టె ప్రభుతో కలిసి ఫోటో తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఆసక్తికర సంగతులు చెప్పారు. “నేను నా కెరీర్ విషయాలను మా అమ్మ తో షేర్ చేసుకోను. సినిమా రంగంలో జయాపజయాలు, ఒత్తిళ్లు మామూలే. నాకున్న టెన్షన్సను మా అమ్మతో పంచుకుంటే ఆమె ఇంకా ఎక్కువ బాధపడుతుంది.
నేను ఇబ్బందుల్లో ఉన్నానన్న ఊహే మా అమ్మ భరించలేదు. అందుకే అవన్నీ చెప్పను.” అని సమంత వ్యక్తిగత విషయాలను చెప్పుకున్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే రూమర్ల గురించి స్పందిస్తూ .. ” మా అమ్మ ట్విట్టర్ ఫాలో కాదు. పేస్ బుక్ జోలికి వెళ్లదు. ఇక యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల గురించి అసలు తెలియదు. కాబట్టి అక్కడి గోల అమ్మ చెవిన పడదు” అని వివరించారు. ఇక తాను అమ్మని ప్రత్యూష ఫౌండేషనకు చాలా సార్లు తీసుకెళ్లానని, అవన్నీ చూసి చాలా సంతోషించినట్లు పేరొన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











