సమంత (Samantha) – నాగ చైతన్య (Naga Chaitanya) 2017 చివర్లో పెళ్లి చేసుకున్నారు. 2021 లో విడిపోయారు. “ఎందుకు విడిపోయారు? వీళ్ళ మధ్య ఏం జరిగింది? ఎంతో అన్యోన్యంగా ఉండే వీళ్ళు ఎలా విడిపోవాలని అనుకున్నారు?” ఇలాంటి ప్రశ్నలు అందరినీ చాలా కాలం వెంటాడాయి. అయితే కొన్నాళ్ల తర్వాత జనాలు వీటిని మర్చిపోయారు. నాగ చైతన్య కూడా వేరే పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం ఏ సినిమా ప్రమోషన్స్ కి వెళ్లినా, ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా..
ఆమె విడాకుల మేటర్ పై ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఆమె నేరుగా సమాధానం చెప్పదు. జనరలైజ్ చేసి చెబుతూ ఉంటుంది. ఆమె కామెంట్స్ ను బట్టి ఆమెకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదేమో అనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమె చైతన్యతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయలేదు. ఇక ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఈ విషయం పై స్పందించింది.
సమంత మాట్లాడుతూ.. “విడాకులు తీసుకున్న ఓ మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు తెలుసు. ఆ బాధను చాలా ఏళ్ళ నుండి భరిస్తున్నాను. ఏం చెబితే అర్థమవుతుంది మీకు. నాపై స్పై చేశారు. ఎన్నో అబద్ధాలు సృష్టించారు. ‘అవన్నీ అబద్దాలు’ అని ఎన్నోసార్లు గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. కానీ నన్ను ఆపింది ఒక్కటే..!
ఒకళ్ళ జీవితం గురించి ఉత్సాహంగా నెగిటివ్ గా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి వాటి నుండి వాళ్ళు పొందేది ఏంటి?ఆ టైంలో వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుందేమో. కానీ ఏదొక సందర్భంలో వివేకంతో ఆలోచిస్తే..’మీరు మాట్లాడేది ఎంత తప్పో మీకు అర్ధమవుతుంది.. అప్పుడు సిగ్గుపడతారు’ అంటూ సర్దిచెప్పుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.