Samantha, Allu Arjun: స్టార్ హీరోపై సమంత షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత కెరీర్ విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలను సమంత ప్రకటిస్తున్నారు.

సమంత నటిస్తున్న శాకుంతలం ఇప్పటికే పూర్తి కాగా కాతు వాక్కుల రెండు కాదల్ మూవీ రిలీజ్ కానుంది. ఒక హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఒక సినిమాకు సైతం ఓకే చెప్పారు. సమంత స్పెషల్ సాంగ్ అయిన ఊ అంటావా ఊఊ అంటావా యూట్యూబ్ లో టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో తొలి స్థానంలో ఉండటం గమనార్హం. పుష్ప థ్యాంక్స్ మీట్ లో బన్నీ స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థ్యాంక్స్ చెప్పారు.

మాపై నమ్మకంతో పుష్పలో స్పెషల్ సాంగ్ చేసినందుకు ఆ నమ్మకానికి థ్యాంక్స్ అని బన్నీ అన్నారు. నన్ను నమ్ము అని ఒక్కమాట చెప్పడంతో సమంత మరో ప్రశ్న వేయలేదని అది తన గుండెను తాకిందని బన్నీ వెల్లడించారు. ఊ అంటావా ఊఊ అంటావా స్పెషల్ సాంగ్ ప్రపంచంలోనే నంబర్ వన్ సాంగ్ గా నిలవడం సాధారణ విషయం కాదని బన్నీ పేర్కొన్నారు. బన్నీ చేసిన కామెంట్ గురించి సమంత స్పందిస్తూ “ఇకపై నేను మిమ్మల్ని ఎప్పటికీ నమ్ముతాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సమంత బన్నీ గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ సామ్ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. భవిష్యత్తులో బన్నీ, సామ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus