Samantha: ఇన్‌స్టాలో ఆ మార్క్ ను టచ్ చేసిన సమంత!

నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ తనకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని సమంత ప్రూవ్ చేసుకుంటున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టా0 lpలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ అవుతున్న సమంత ఇన్ స్టాగ్రామ్ లో అరుదైన రికార్డును సాధించారు. ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. సోషల్ మీడియాలో కూడా సామ్ దూకుడు చూపిస్తుండటం గమనార్హం. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉండటంతో సమంతకు ఇన్ స్టాగ్రామ్ లో ఊహించని స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు.

చాలామంది బాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే ఫాలోవర్ల పరంగా సమంత ముందువరసలో ఉండటంతో పాటు సోషల్ మీడియా క్వీన్ గా నిలిచారు. అభిమానులను ఆకట్టుకునే పోస్టులు చేయడం ద్వారా సమంత క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. సమంత నటించిన శాకుంతలం, కాత్తువాకుల రెండు కాదల్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. భవిష్యత్తులో ఇన్ స్టాగ్రామ్ లో సమంత మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

సమంత బాలీవుడ్ ప్రాజెక్టులకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో కూడా సమంతకు ఆఫర్లు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. మహేష్ సినిమాలో సమంత నటిస్తారని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus