Samantha: త్రీ క్రోర్స్‌ లీగ్‌లోకి వచ్చేసిన సమంత!

టాలీవుడ్‌లో హీరోయిన్ల రేస్‌ గురించి తెలిసిందే. ప్రతి శుక్రవారం హీరోల ఫేట్‌ కౌంట్‌ వేసినట్లు, హీరోయిన్ల రెమ్యూనరేషన్‌లో మార్పులు వచ్చేస్తుంటాయి. ఒక హీరోయిన్‌ హిట్‌ కొడితే మరో హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ పెంచేస్తుంటుంది అంటారు. కారణం రెండు హిట్‌లు ఉన్న ఆమెకు అంత ఇస్తారా? నాకు మూడు హిట్లు ఉన్నాయి అని ఆలోచనే. అయితే ఇవేవీ అధికారిక లెక్కలు కావనుకోండి. అలా సమంత తాజాగా ఓ సినిమాకు మూడు కోట్ల రూపాయలు అడుగుతోందనేది టాక్‌.

విజయ్‌ దేవరకొండ – సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా ఓకే అయినట్లు ఇటీవల వార్తలొస్తున్నాయి. ఫీల్‌ గుడ్‌ (శాడ్‌) ప్రేమకథల స్పెషలిస్ట్‌ ఇటీవల కాలంలో కనిపిస్తున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. నిజానికి శివ – విజయ్‌ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయ్యింది. అయితే విజయ్‌ బిజీ అవ్వడం, శివ ‘టక్‌ జగదీష్‌’తో ఢీలా పడటంతో ఆ సినిమా ఉందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సమంత పేరు చర్చలోకి రావడంతో ఆ సినిమా ఉంది అనే మాటే వినిపిస్తోంది.

శివ నిర్వాణ – విజయ్‌ సినిమాలో నటించడానకి సమంత ఓకే చెప్పిందని ఆ మధ్య మనం చదువుకున్నాం. అయితే దీని కోసం మూడు కోట్లు రూపాయలకపైగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటోందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆ రేంజిలో పారితోషికం అందుకుంటున్న వారిలో పూజా హెగ్డే, రష్మిక మందన మాత్రమే ఉన్నారు. అందులో పూజ ఒక మెట్టు పైనే ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు సమంత కూడా ఈ త్రీ క్రోర్స్‌ క్లబ్‌లోకి వచ్చేసిందట. సినిమాలో సామ్‌ పాత్ర బలంగా ఉండటం, డేట్స్‌ కూడా ఎక్కువ అడగడంతో ఈ మాత్రం తీసుకుంటోందని సమాచారం.

నిజానికి సమంత మునపటి జోరులో సినిమాలు చేసి ఉంటే పూజ కంటే పైనే ఉండేది. పెళ్లి, ఆ తర్వాత పరిస్థితుల కారణంతో సినిమాలు తగ్గించింది. సెలక్టివ్‌గా చేస్తూ వచ్చింది. దీంతో రేసులో కాస్త వెనుకబడింది. ఇటీవల నాగచైతన్యతో విడిపోయిన తర్వాత జోరు పెంచి సినిమాల సంఖ్య పెంచింది. ఇప్పుడు పారితోషికం కూడా పెంచింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus