Samantha: సినిమాలు రావడం లేదు.. రేటు మాత్రం పెరుగుతోంది!

పారితోషికం విషయంలో ఓ హీరోయిన్‌ పట్టుబట్టి మరీ ఎక్కువ అడుగుతోంది అంటే.. ఫుల్‌ హిట్స్‌ స్వింగ్‌లో అయినా ఉండాలి. లేదంటే ఆమె లేకపోతే ఆ సినిమా లేదు అనే ఫీలింగ్‌ అయినా కలగాలి. అయితే వీటికితోడుగా వరుస సినిమాలు చేస్తుండాలి. కానీ వీటిలో ఏదీ లేని సమంత పారితోషికం విషయంలో పట్టుబడుతోందని టాక్‌. ఆమెకు వరుసగా సినిమాలు లేకపోవడానికి కూడా అదే కారణం అని కూడా చెబుతున్నారు. ఇందులో నిజానిజాలెంతో తెలియదు కానీ.. యంగ్‌ స్టార్‌ హీరోయిన్లకు సమానంగా, కుదిరితే ఎక్కువే అడుగుతోందని టాక్‌.

సౌత్‌ సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లు, హిందీ సినిమాలు చేసేయాలని ఆలోచనలో ఉంది సమంత. అందుకే వరుసగా అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆశించినంత వేగంగా సినిమాలు ఓకే కావడం లేదు. ఆ సినిమాకు అడిగారు, ఈ సినిమాకు అడిగారు, హాలీవుడ్‌ సినిమా చేస్తుందట అని చెబుతున్నారు కానీ.. ఏవీ అధికారికంగా ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలో సమంత తన కొత్త సినిమాలకు రూ. 3 కోట్ల నుండి రూ. 4 కోట్ల వరకు అడుగుతోందనే టాక్ బయటకు వచ్చింది.

సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని అప్పుడు టాక్‌ వచ్చింది. ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలకు రూ.2.5 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. అయితే ఇప్పుడు కొత్త సినిమా చేయడానికి కోటి రూపాయలు ఎక్కువగా డిమాండ్‌ చేస్తోందట. సమంత ఇప్పటికే గుణశేఖర్‌ ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కోసమని ఇంకా చాలా సమయం తీసుకునేలా ఉంది ఆ సినిమా.

ఆ తర్వాత తెలుగులో విజయ్‌ దేవరకొండతో ‘ఖుషి’ చేసింది. ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. విజయ్‌ దేవరకొండకి ‘లైగర్‌’ షాక్‌ ఇవ్వడంతో.. కొన్నాళ్లు రెస్ట్‌ తీసుకొని వచ్చి కొత్త సినిమా మొదలుపెడతామని చెబుతున్నాడు. కాబట్టి ఈ సినిమా ఆలస్యమవుతుంది. ఇక మరో సినిమా ‘యశోద’ ఈ పాటికే విడుదలవ్వాలి. కానీ ఏమైందో కానీ ఆ ఊసే లేదు. విడుదల విషయం ఏమో కానీ.. సినిమా పనులు పూర్తయ్యాయా అనేది తెలియడం లేదు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus