Samantha: సామ్ కోరుకుంటున్న పాత్రలు రావడం లేదా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. ఈ బ్యూటీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అలానే తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం ఈమె తన కెరీర్ లో మరింత బిజీ అయింది. వరుస ప్రాజెక్ట్ లను ఒప్పుకుంటోంది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ‘యశోద’ సినిమాలో నటిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్, ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ ప్రాజెక్ట్ లు సమంతకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపును తీసుకొచ్చాయి.

దీంతో ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే పలు సార్లు దర్శకనిర్మాతలు కలవడం కోసం ముంబైకి వెళ్లింది ఈ బ్యూటీ. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకుంటున్నారని సమాచారం. దీనిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంతకు బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రావడం లేదట. సెకండ్ హీరోయిన్ రోల్స్ వస్తుండడంతో సమంత నో చెబుతోందట.

లీడ్ రోల్స్ తప్ప సెకండ్ హీరోయిన్ గా చేయడానికి సమంత రెడీగా లేదని తెలుస్తోంది. అలానే ఆర్ట్ ఫిలిమ్స్ లో నటించడానికి కూడా ఒప్పుకోవడం లేదట. పక్కా కమర్షియల్ సినిమాల్లో లీడ్ రోల్ ఆఫర్స్ కోసం చూస్తుంది ఈ బ్యూటీ. మరి ఆమె ఆశిస్తున్నట్లు అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇదిలా ఉండగా..

రీసెంట్ గా సమంత.. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి ‘ఖుషి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus