Samantha: మీ ఆప్యాయతకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత పోస్టు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఈమె అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నారని తెలుస్తోంది.మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ ఇంటికి పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పెద్దగా పాల్గొనలేదు. ఇకపోతే యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత పాల్గొనక పోయినప్పటికీ ప్రేక్షకులు అభిమానులు మాత్రం ఈ సినిమాని సమంత కోసం హిట్ చేయాలని భావించారు.

ఈ క్రమంలోని నవంబర్ 11వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. యశోద సినిమాకు ఆడియోస్ నుంచి వస్తున్న ఆదరణ చూసినటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గత సినిమాలతో పోలిస్తే ఈసారి యశోద సినిమాను ప్రమోట్ చేయడంలో మీ సహకారం ఎక్కువగా అందుతుందని ఆశిస్తున్నాను.

 

ఈ సినిమా విడుదలకు ముందు మీరు నాపై చూపించిన ఆప్యాయతకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని.మీరే నా ఫ్యామిలీ మీరంతా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సమంత మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ సినిమా యశోద ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాకి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక కమర్షియల్ గా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus