Samantha: బాలీవుడ్ హీరోతో కలిసి ఐటమ్ సాంగ్ చేస్తున్న సామ్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక ది ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఈ వెబ్ సిరీస్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఈ వెబ్ సిరీస్ లో నటించడమే కాకుండా ఈమె పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ నార్త్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపిందని చెప్పాలి.

విడాకుల తర్వాత సమంత మొట్టమొదటిసారి స్క్రీన్ పై కనపడుతూ ఇలా ఐటమ్ సాంగ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే సమంత సరైన బాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేయడానికి సమంత ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమాలో ఉ అంటావా మావ ఊ అంటావా అనే పాటతో రెచ్చిపోయి డాన్స్ చేశారు.

ఈ పాటతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఈమె మరో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగ దర్శకత్వంలో బాలీవుడ్‌లో యానిమల్ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాట హిందీతో పాటు సౌత్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉండాలని డైరెక్టర్ సందీప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ఐటమ్ సాంగ్ లో చేయడం కోసం ముందుగా చిత్రబృందం పూజా హెగ్డేను తీసుకోనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పూజ స్థానంలో సమంత పేరు వినపడుతోంది. ఇప్పటికే ఐటమ్ సాంగ్ ద్వారా ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్న సమంత మరోసారి రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో సందడి చేయనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus