Samantha: సమంత చికిత్సకు ఇంకా ఎంత టైం పడుతుందంటే..?

స్టార్ హీరోయిన్ సమంత గతకొద్ది రోజులుగా మీడియా అండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎప్పుడైతే తనకు సోకిన మయోసిటీస్ అనే అరుదైన వ్యాధి గురించి బయట ప్రపంచానికి చెప్పిందో అప్పటినుండి ఫ్యాన్స్‌తో పాటు ఫిలిం ఇండస్ట్రీ వారు, సన్నిహితులు సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో సమంత తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అవడం చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.

ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చింది.. మొన్నీ మధ్య సామ్ ట్రీట్‌మెంట్ కోసం కేరళ వెళ్లిందనే న్యూస్ వచ్చింది. తను ఇంతకుముందు అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంది. దీని వల్ల పూర్తిగా నయమయ్యే అవకాశాలు లేవని, ఆయుర్వేద చికిత్స తీసుకుంటే మయోసిటీస్ తగ్గుముఖం పడుతుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో.. సమంత కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందని అంటారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సామ్ ట్రీట్‌మెంట్ కోసం దక్షిణ కొరియా వెళ్లిందని,

ఈ లెక్కన నయం కావడానికి ఇంకా చాలా టైం పడుతుందని న్యూస్ స్ప్రెడ్ అవడంతో ఆమె పర్సనల్ టీం రెస్పాండ్ అయ్యారు. ‘‘సమంత ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది.. ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావట్లేదసలు.. చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లడం ఏంటి?.. ఎలాంటి సమాచారం లేకుండానే ఆరోగ్యం గురించి ఇష్టమొచ్చినట్లు రాసేస్తారా?’’ అంటూ ఫైర్ అయ్యారు. ఈమధ్య సమంత ఆరోగ్యం గురించి తమిళ మీడియాలో కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.

సామ్ ఆరోగ్యం బాగోలేదని.. ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ అయింది అంటూ కథనాలు ప్రచురించారు. దీంతో ఫ్యాన్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే సామ్ హెల్త్ కండీషన్ గురించి ఆమె పర్సనల్ మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సమంతం ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుందని.. బయట వస్తున్న వార్తల్లో నిజం లేదు.. అలాంటి వదంతులు నమ్మకండి అని తెలిపారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus