Samantha: సమంత హ్యాండ్ ప్రింటెడ్ శారీ.. రేటు తెలిస్తే షాకే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పన్నెండేళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తన కెరీర్ లో మంచి నటిగానే కాకుండా.. తన సమాజ సేవతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఈ బ్యూటీ కాస్ట్యూమ్స్ ను అభిమానులు ఫాలో అవుతూనే ఉంటారు. సొంతంగా ‘సాకి’ అనే బ్రాండ్ ను కూడా మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా సమంత ఓ చీర కట్టుకొని ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డ్ కలర్ శారీ, దానికి తగ్గట్లుగా జ్యువెలరీ వేసుకొని కనిపించింది సమంత. ఈ చీర స్పెషాలిటీ ఏంటంటే.. మొత్తం హ్యాండ్ తో ప్రింట్ చేసిన శారీ. లోకల్ డిజైనర్ రూపొందించిన ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా..? రూ.1 లక్ష 15 వేలు. ఈ రేటు తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఆమె రేంజ్ కి లక్ష రూపాయల చీర అనేది చాలా తక్కువ అని అంటున్నారు. అయితే కొందరు మాత్రం చీర కోసం లక్షలు ఖర్చు చేయడమనేది పిచ్చితనమని కామెంట్స్ చేస్తున్నారు.

సెలబ్రిటీలు ఇలా ప్రమోట్ చేయడం వలనే వాటికి మరింత డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. మొత్తానికి లక్ష చీర కట్టుకొని వార్తల్లో నిలిచింది సమంత. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘శాకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క ‘యశోద’ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాలో సమంత నర్స్ పాత్రలో కనిపించబోతుంది సమాచారం. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటు మరో బైలింగ్యువల్ సినిమాలో ఒప్పుకుంది. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది.

1

2

3

4

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus