Shaakuntalam: సమంత లుక్‌తో ఫిదా చేసిన గుణశేఖర్‌ టీమ్‌!

‘అభిజ్ఞాన శాకుంతలం’ గురించి తెలుసా అంటే నేటి తరం సినిమా ప్రేక్షకులకు ‘తమ్ముడు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పే క్లాస్‌ గుర్తొస్తుంది. అసలు ‘శాకుంతల’ కథేంటి అంటే… ఇప్పటివాళ్లకు ఆ విషయాలు తెలియకపోవచ్చు. అలాంటి మిలీనియల్స్‌ అందరికీ శాకుంతల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌. ‘శాకుంతలం’ పేరుతో ఆ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కథానాయిక సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Click Here To Watch

ఓ అడవి మధ్యలో చిన్న కొండరాయి మీద వయ్యారంగా శాకుంతల కూర్చున్నట్లుగా పోస్టర్‌ను చిత్రబృందం రూపొందించింది. తెలుపు రంగు దుస్తులు, బోర్డర్‌ గులాబీ పూలతో సమంత డ్రెస్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు అని చెప్పాలి. ఆ లుక్‌లో సమంత అచ్చంగా దేవకన్యలా ఉందని నెటిజన్లు ఇప్పటికే కామెంట్లు చేస్తున్నారు. సమంత లుక్‌, ఫిగర్‌కి ఆ వైట్‌ కలర్‌ డ్రెస్‌ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక గ్రాఫిక్స్‌ పరంగా చూసినా పోస్టర్‌ అదిరిపోయింది. సినిమా విషయంలో టీమ్‌ ఎంత కష్టపడుతోందా ఈ పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది.

‘శాకుంత‌లం’ సినిమాలో యువ భరతుడిగా ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ నటించింది. సినిమాలో కీలక పాత్ర అయిన దుష్యంత మ‌హారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ‘శాకుంతలం’ చిత్రాన్ని నీలిమా గుణ నిర్మిస్తున్నారు. గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్‌ చేస్తున్న చిత్రమిది.

ఆ సినిమా విషయంలో వచ్చిన విమర్శల నుండి గుణశేఖర్‌ అండ్‌ టీమ్‌ బాగానే కుదురుకున్నట్లుగా ఉంది. సినిమా గ్రాఫిక్స్‌, పాత్రల విషంయలో ఆ సినిమాకు విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘శాకుంతలం’ సినిమా ఫస్ట్‌లుక్‌లో క్వాలిటీ కనిపిస్తోంది. సినిమాలో ఈ స్థాయి నాణ్యత ఉంటే… సినిమా విజయం పక్కా అనుకోవచ్చు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus