Samantha: సమంత ఫస్ట్‌ సినిమా అది కాదా? ఫేవరెట్‌ హీరో సినిమా వదులుకుందా?

సమంత (Samantha) థర్డ్‌ ఇన్నింగ్స్‌లో ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. అనారోగ్యం నుండి కోలుకున్నాక కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఆమె ఆలోచనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంత నిర్మాణ సంస్థలో ఓ సినిమా నటిస్తోంది. ఇది కాకుండా ఆమె చిరకాల కోరిక కూడా తీర్చుకుంటోంది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అదే ఆమె ఫేవరెట్‌ యాక్టర్‌ మమ్ముట్టి సినిమా. ఈ సినిమా రీసెంట్‌గా మొదలైంది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ (Gautham Vasudev Menon) ఈ సినిమాకు దర్శకుడు అనే విషయం తెలిసిందే.

అయితే, ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆ సినిమా ప్రారంభోత్సవానికి సమంత వెళ్లలేదు. దీంతో అసలు ఆమె సినిమాలో ఉందా? లేదా? అనే చర్చ మొదలైంది. ఆమె మలయాళం లాంచింగ్ ఆ సినిమానే అని వార్తలొస్తున్న తరుణంలో ప్రారంభోత్సవానికి ఆమె వెళ్లకపోవడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సినిమా ప్రారంభోత్సవానికి చాలామంది మాలీవుడ్‌ ప్రముఖులు వచ్చారు. మమ్ముట్టిపై (Mammootty) ముహూర్తం సన్నివేశం కూడా చిత్రీకరించారు.

అయితే ఆమె సినిమాలోనే ఉందని, ఆమె షెడ్యూల్‌ ఉన్నప్పుడు వచ్చి హాజరవుతుంది అని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే గౌతమ్‌ మీనన్‌ ఒప్పించారు అని కూడా అంటున్నారు. ఆమె కెరీర్‌లో అతి పెద్ద సినిమా ఇచ్చింది ఆయనే. కాబట్టి ఈ సినిమా నుండి ఆమె తప్పుకునే అవకాశం చాలా తక్కువ అని అంటున్నారు. మరి ఎందుకు ఆమె ఎందుకు సినిమా ఓపెనింగ్‌కి రాలేదు అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆమెనే నిర్మిస్తోంది. గన్‌ చేతపట్టిన గృహిణిగా ఆ సినిమా పోస్టర్‌లో కనిపించింది సమంత. ‘బంగారం అనిపించుకోవాలంటే ప్రతిదీ మెరిసిపోవల్సిన అవసరం లేదు’ అని సినిమా కాన్సెప్ట్‌ గురించి ఆ పోస్టర్‌తోపాటు రాసుకొచ్చారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఇవి కాకుండా ఆమె ‘సిటడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లో నటించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus