Samantha: సమంత కొత్త సోషల్‌ మీడియా పోస్ట్‌.. మరో డిలీట్‌ వైరల్‌!

రిలేషన్‌ షిప్‌ బ్రేక్‌ తర్వాత సమంత జోరు పెంచింది. సినిమాల విషయంలోనే కాదు, డేరింగ్‌ ఫీట్స్‌లోనూ తన వేగం చూపిస్తోంది. మొన్నటికి మొన్న గోవాలో కయాకింగ్‌, అడవుల్లో ట్రెక్కింగ్‌ని వంటి సాహసాలను చేస్తూ హాలీడే ట్రిప్స్ ఎంజాయ్‌ చేసింది. పారా సైక్లిస్టులతో కలసి వర్షంలో 100 కి.మీ ఛాలెంజ్‌ను కూడా పూర్తి చేసింది. జలపాతాల దగ్గర హాట్‌ హాట్‌ బికినీ ఫొటోలతో హీట్‌ కూడా పెంచింది. ఇప్పుడు మరోసారి తన డేర్‌ డెవిల్‌ స్టంట్‌ని చేసి చూపించింది. సామ్‌తో మామూలుగా ఉండదు అంటూ చెప్పకనే చెప్పింది.

ఇంతకీ ఏం చేసిందనేది ఎంత ఆసక్తో, ఆ తర్వాత ఆమె చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్టు అంతకంటే ఆసక్తి రేకెత్తిస్తోంది. ముందుగా చెప్పుకున్నట్లు ఇటీవల కాలంలో విహారయాత్రలు, సాహసయాత్రలను బాగా ఆస్వాదిస్తోంది సమంత. ఈ క్రమంలో ఆమె స్విట్జర్లాండ్‌లో ఉంది. అక్కడ స్కీయింగ్‌ చేస్తూ హాలీడే ట్రిప్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్‌ చేసుకుంది సమంత. అందులో సామ్‌ ఎంతో డేరింగ్‌గా స్కీయింగ్‌ చేయడం మనం చూడొచ్చు. దాంతోపాటు మరో పోస్టు కూడా చేసింది సమంత.

‘‘గతంలో ఎప్పుడూ స్కీయింగ్‌ చేయలేదు. ఈ ఆట చాలా సాహసోపేతమైనది. అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. అయినా స్కీయింగ్‌ని విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి స్కీయింగ్ ట్రైనర్స్‌ కేట్‌, టోనెస్కినే కారణం’’ సోషల్‌ మీడియాలో ధన్యవాదాలు తెలియజేసింది సమంత. సమంత ఫీట్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌, కొంతమంది సెలబ్రిటీల నుండి మంచి స్పందన వస్తోంది. ‘‘సమంతా… ఏదైనా స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించిరా’’ అంటూ ఆమె స్నేహితురాలు గాయని చిన్మయి శ్రీపాద కామెంట్‌ చేసింది.

అయితే సమంత డివోర్స్‌ స్టేట్‌మెంట్‌ను ఎందుకు డిలీట్‌ చేసిందో మాత్రం తెలియడం లేదు. అయితే ఆమె డిలీట్‌ చేసిందా? లేక డిలీట్‌ అయిపోయిందా అనే అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’లో నటిస్తోంది. దీంతోపాటు ఇంటర్నేషనల్‌ సినిమా ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లో కీలక పాత్ర పోషిస్తోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus