Samantha: ‘పుష్ప’ ఐటెం సాంగ్ : ట్రోలింగ్ పై రియాక్ట్ అయిన సమంత..!

పుష్ప మూవీలో హైలెట్‌గా నిలిచింది సమంత సాంగ్. ‘‘ఊ అంటావా మావ … ఊఊ అంటావా’’ అంటూ సాగే ఈ పాటకు మాస్ జనాలు ఊగిపోతున్నారు. ఐటెం సాంగ్స్ తీయడంలో సిద్ధహస్తుడైన సుకుమార్.. తన మార్క్ మరోసారి చూపించారు. రచయిత చంద్రబోస్‌ ఈ పాటని రాయగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గణేష్ ఆచార్య డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించగా… ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు. అలాగే కెరీర్‌లో ఈ తరహా సాంగ్స్‌లో నర్తించడం సమంతకు ఇదే తొలిసారి.

కేవలం ఐదు రోజుల డేట్స్ కోసం ఆమె కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అందరి కష్టం ఫలించి ‘‘ఊ అంటావా మావా’’కు జనాలకు బ్రహ్మరథం పడుతున్నారు. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించడంతో పాటు థియేటర్‌లోనూ ఆ పాట రాగానే విజిల్స్, కేకలతో ప్రేక్షకులు హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ‘‘పుష్ప’’ యూనిట్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా సమంత చాలా హ్యాపీగా వున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె తొలిసారిగా కనిపించిన సినిమా కావడంతో జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆమె కంగారుపడ్డారట.

కానీ అంతా సాఫీగా జరగడం, తన తొలి ఐటెం సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సామ్ ఖుషీగా వున్నారు. అయితే `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా` సాంగ్‌ పురుషుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే వివాదం సృష్టించిన ఈ పాటపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా సమంత స్పందించారు. సెక్సీగా కనిపించాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలని…

తాను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించడానికి శ్రమిస్తున్నాను అని సమంత పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పుష్ప మూవీలోని ఓ ఫోటో షేర్ చేస్తూ నేను బాగా డ్యాన్స్ చేశానని.. ఫన్నీగా, సీరియస్‌గా కనిపించానని కామెంట్ చేశారు. అయితే ఈ పాటలో నటించే అవకాశాన్ని సమంత మొదట రిజెక్ట్ చేసిందని సుకుమార్ తెలిపారు. తరువాత ఆయనే ఆమెను ఒప్పించాడు ‘రంగస్థలం’లో పూజా హెగ్డే డ్యాన్స్ ఉదాహరణగా చెప్పాడట.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus