Samantha: అలాంటి పాత్రలో తొలిసారి నటిస్తున్న సామ్!

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. సమంత నటించిన శాకుంతలం వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుండగా ప్రస్తుతం సామ్ యశోద మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని బోగట్టా.

ఈ సినిమాలో సమంత నర్సు రోల్ లో కనిపిస్తారని సమాచారం. సమంత ఇప్పటివరకు ఈ తరహా పాత్రను చేయలేదు. ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాలో కథ మొత్తం సమంత చుట్టూ తిరుగుతుందని సమంత సైతం ఈ సినిమాతో తన ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమని నమ్మకంతో ఉన్నారని బోగట్టా. హరి, హరీష్ అనే దర్శకులు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది.

సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, కల్పిక గణేష్, రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు సౌత్ ఇండియాలోని ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ సమంత సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

ఒక్కో సినిమాకు సమంత మూడు కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. సమంత సినిమాకు ఓకే చెబితే అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధపడుతున్నారు. సోషల్ మీడియాలో సమంతకు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. సమంత ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సమంత భవిష్యత్తు ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus