Samantha: గుర్రపు స్వారీ చేస్తున్న సమంత… పూర్తిగా కోలుకున్నట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా విడాకుల తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఉన్నఫలంగా మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు. ఇలా ఈ వ్యాధి కారణంగా ఈమె నడవలేని స్థితికి వెళ్లిపోవడంతో పూర్తిగా బెడ్ కి పరిమితమయ్యారు ఇలా బెడ్ పైనుంచి యశోద సినిమా డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు.

ఇలా ఈ వ్యాధితో బాధపడుతూ తను కమిట్ అయిన సినిమాలు వెబ్ సిరీస్ లకు దూరంగా ఉన్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయట పడుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వ్యాధి నుంచి ఈమె కోలుకోవడంతో తిరిగి తన సినిమా షూటింగ్ పనులతో బిజీ కానున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే పెద్ద ఎత్తున వర్కౌట్లు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సమంత తాజాగా హార్స్ రైడింగ్ కూడా చేస్తూ సందడి చేశారు.

సోషల్ మీడియాలో తిరిగి ఆక్టివ్ అయినటువంటి ఈమె హార్స్ రైడింగ్ చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు అభిమానులు సమంతా ఇలా వర్కౌట్స్ చేస్తూ ఉండటం చూసే సమంత పూర్తిగా మయోసైటీసిస్ వ్యాధి నుంచి కోలుకున్నట్టేనా అంటూ కామెంట్లో చేస్తున్నారు.ఇక ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నటువంటి ఖుషి సినిమాలో నటిస్తున్నారు.

అదేవిధంగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కోసమే ఈమె పెద్ద ఎత్తున హార్స్ రైడింగ్ విన్యాసాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి సినిమా షూటింగ్లకు హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus