Samantha, Naga Chaitanya: నాగచైతన్య పై సమంతకి ఇంత కోపమా.. అంతలా ఏం చేశారు?

సమంత నాగచైతన్య విడాకుల విషయం గురించి ప్రకటించి సంవత్సరమైన వీరి విడాకుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంత నాగచైతన్య విడాకులకుగల కారణాలు ఏంటి అని పెద్ద ఎత్తున నేటిజన్లు వీరి విడాకులు గురించి ఆరా తీశారు. అయితే ఇప్పటివరకు వీరి విడాకులకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. అయితే సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.

ఈ టాక్ షోలో భాగంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానం చెప్పారు ఈ క్రమంలోనే సమంత నాగచైతన్యతో విడాకులకు గల కారణం ఆయన నుంచి తీసుకున్న భరణం గురించి మాట్లాడారు.అదేవిధంగా విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎంతో కఠినమైన జీవితాన్ని అనుభవించాలని ఈ సందర్భంగా సమంత తెలియజేశారు.

ఇకపోతే నాగచైతన్యను ఉద్దేశిస్తూ మీ భర్త అంటూ కరణ్ మాట్లాడగా మాజీ భర్త అంటూ సమంత కౌంటర్ ఇచ్చింది. ఇలా మాజీ భర్త అంటూనే కరణ్ తన గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఒకవేళ ఇప్పుడు కనుక మీ ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే ముందుగా అక్కడ కత్తులు వంటి మారణాయుధాలు లేకుండా జాగ్రత్త పడతాము అంటూ సమాధానం ఇచ్చింది.

ఇకపోతే ఇద్దరు స్నేహంగాఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు పై మీ సమాధానం అని ప్రశ్నించగా ఇప్పటికే తనపై ఎలాంటి స్నేహభావం లేదు భవిష్యత్తులో ఉండవచ్చేమో అంటూ ఈమె సమాధానం చెప్పారు. సమంత ఇలా చైతన్య గురించి చెప్పడంతో ఎంతోమంది అభిమానులు సమంతకు నాగచైతన్య పై ఎందుకంత కోపం ఏకంగా చంపుకుంటాము అంటూ కామెంట్ చేశారని ఆశ్చర్యపోతున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus